గరిష్టస్ధాయి నుంచి రూ 4000 తగ్గిన బంగారం

24 Aug, 2020 20:29 IST|Sakshi

లాక్‌డౌన్‌ సడలింపులతో వన్నెతగ్గిన పసిడి

ముంబై : కోవిడ్‌-19కు మెరుగైన చికిత్స, వ్యాక్సిన్‌ త్వరలో అందుబాటులోకి వస్తుందనే అంచనాలతో స్టాక్‌ మార్కెట్లు లాభపడటం పసిడి ధరలకు బ్రేక్‌ వేసింది. కొద్దిరోజులుగా తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు సోమవారం పతనాల బాటలో సాగాయి. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా దేశీ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు దిగివచ్చాయి.

ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 424 రూపాయలు తగ్గి 51,592 రూపాయలు పలికింది. ఇక 743 రూపాయలు తగ్గిన కిలో వెండి 66,324 రూపాయలకు దిగివచ్చింది. ఈ నెల గరిష్టస్ధాయి నుంచి బంగారం ఇప్పటివరకూ 4000 రూపాయలు తగ్గడం పసిడి ధరల తగ్గుదలపై ఆశలు రేకెత్తిస్తోంది. డాలర్‌ నిలకడగా ఉండటంతో పాటు కోవిడ్‌-19 చికిత్సకు ప్లాస్మా థెరఫీకి అమెరికన్‌ డ్రగ్‌ అథారిటీ అనుమతి ఇవ్వడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ ధర తగ్గుముఖం పట్టింది.

చదవండి : రిలీఫ్‌ : రికార్డు ధరల నుంచి దిగివస్తున్న పసిడి

మరిన్ని వార్తలు