ఇంత తిన్నావేంటి గురూ..  పిజ్జాల కోసం డామినోస్‌ మాజీ సీఈవో ఖర్చు ఎంతో తెలుసా?

18 Mar, 2023 10:57 IST|Sakshi

డామినోస్ మాజీ సీఈవో రిచ్ అల్లిసన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. 2022లో ఆయన కంపెనీని విడిచిపెట్టినప్పుడు ఈ పదవి తనకు జీవితకాల ప్రత్యేక హక్కు అని వ్యాఖ్యానించారు. తాజాగా గత సంవత్సరం డామినోస్‌ మాజీ సీఈవో ఖర్చులకు సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన వ్యక్తిగత పిజ్జా ఖర్చు కోసం దాదాపు 4,000 డాలర్లు (రూ.3లక్షలకు పైగా) చెల్లించినట్లు తెలిసింది.

ఇదీ చదవండి: ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌.. ఇక అన్‌లిమిటెడ్‌ 5జీ డేటా!

ఫినాన్షియల్‌ టైమ్స్‌ కథనం ప్రకారం...  డామినోస్ ఎగ్జిక్యూటివ్ పరిహారం కింద 2021 సంవత్సరంలో వ్యక్తిగత పిజ్జా కొనుగోళ్ల కోసమే అల్లిసన్‌కు కంపెనీ 3,919 డాలర్లు చెల్లించింది. దీంతోపాటు వ్యక్తిగత జెట్, బృంద సభ్యుల బహుమతులు, ఇతర ఖర్చులకు ఆ సంవత్సరానికి అల్లిసన్‌ మొత్తంగా 7,138,002 డాలర్లు (దాదాపు రూ.59 కోట్లు) అందుకున్నారు. 

2020లో మరీ ఎక్కువ..
2021లో అల్లీసన్‌ పిజ్జాల ఖర్చు అంతకుముందు సంవత్సరం అంటే 2020తో పోల్చుకుంటే తక్కువే. 2021లో 3,919 డాలర్లు ఖర్చు చేస్తే అదే 2020 కరోనా మహమ్మారి సమయంలో ఆయన పిజ్జా ఖర్చు 6,126 డాలర్లు అంటే రూ.5 లక్షలకు పైనే.  డామినోస్‌ ప్రస్తుత సీఈవో రస్సెల్ వీనర్ కూడా 2021లో వ్యక్తిగత పిజ్జా కొనుగోళ్ల కోసం 2,810 డాలర్లు ఖర్చు చేశారు.

ఇదీ చదవండి: Sandeep Bakhshi: ఐసీఐసీఐ బ్యాంకును నిలబెట్టిన సీఈవో ఈయన.. జీతం ఎంతో తెలుసా? 

అల్లిసన్ డామినోస్ కోసం పదేళ్లకుపైగా పనిచేశారు. ఇందులో నాలుగేళ్లు కంపెనీ సీఈవోగా వ్యవహరించారు.  2022లో ఆయన పదవీ విరమణ పొందారు. అల్లిసన్ సీఈవోగా ఉన్నప్పుడు కంపెనీని పురోగతి వైపు నడిపించడమే కాకుండా రిస్క్‌ తీసుకునే వాతావరణాన్ని ప్రోత్సహించారు.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు