Domino's Pizza: కొత్త నిర్ణయం... పొల్యూషన్‌ ఫ్రీ డెలివరీ !

27 Jul, 2021 11:43 IST|Sakshi

హైదరాబాద్‌: ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మీరాచానుకి జీవితాంతం ఫ్రీ ఆఫర్‌ ప్రకటించి దేశ ప్రజల మన్ననలు అందుకున్న డోమినోస్‌ మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకుంది. వాతవారణ కాలుష్యం తగ్గించడంలో భాగంగా తన వంతు ప్రయత్నాలను ప్రారంభించింది.

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌
డెలివరీ పర్సన్స్‌ ప్రస్తుతం ఉపయోగిస్తున్న పెట్రోలు బైకులు, స్కూటర్ల స్థానంలో ఇక నుంచి కాలుష్యం విడుదల చేయని ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌ను ఎంపిక చేసిన నగరాల్లో ప్రయోగాత్మకంగా  ఉపయోగించాలని డొమినోస్‌ నిర్ణయించింది. అక్కడ సానుకూల ఫలితాల వస్తే క్రమంగా దేశవ్యాప్తంగా అన్ని స్టోర్లలో పని చేస్తున్న డెలివరీ పర్సన్స్‌ ప్రస్తుతం ఉన్న పెట్రోలు బైకుల స్థానంలో ఎలక్ట్రిక్‌ బైకులు ఉపయోగించేలా మార్పులు తేనుంది.

రివోల్ట్‌ 300
కాలుష్య నియంత్రణలో భాగంగా రివోల్ట్‌ 300 మోడల్‌ ఎలక్ట్రిక్‌ బైకులను డొమినోస్‌ పిజ్జా ఉపయోగించనుంది. ఈ మేరకు రివోల్ట్‌తో సంప్రదింపులు చేపడుతోంది. డెలివరీకి అనుగుణంగా ఈ బైకులను కష్టమైజ్‌ చేయనున్నారు. ఈ బైకులను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 80 నుంచి 150 కి,.మీ రేంజ్‌ మైలేజీ ఇవ్వగలవు. గరిష్ట వేగం గంటలకు 65 కిలోమీటర్లు. 

వేలల్లో డెలివరీ పర్సన్స్‌
డొమినోస్‌ పిజ్జాకి దేశ వ్యాప్తంగా వేలాది అవుట్‌లెట్లు ఉన్నారు. వేలాది మంది డెలివరీ బాయ్స్‌ నిత్యం నగరాల్లో బైకులపై తిరుగుతూ పిజ్జాలను డెలివరీ చేస్తున్నారు. వేలల్లో ఉన్న ఈ డెలివరీ పర్సన్స్‌ నిత్యం పెట్రోలు బైకులపై తిరుగుతూ తమ విధులు నిర్వహ్తిన్నారు.

మరిన్ని వార్తలు