FaceBook : జుకర్‌బర్గ్‌కి ఎసరు పెట్టిన ట్రంప్‌

16 Jun, 2021 17:42 IST|Sakshi

ఫేస్‌బుక్‌ సీఈవో కొంప ముంచిన డోనాల్డ్‌ ట్రంప్‌

ట్రంప్‌ వివాదంపై చక్కబెట్టడంలో మార్క్‌ విఫలం

మార్క్‌ తీరుపై ఆ సంస్థ ఉద్యోగుల అసంతృప్తి 

గ్లాస్‌డోర్‌ టాప్‌ 100 సీఈవో లిస్టులో మార్క్‌కి దక్కని చోటు

2013 తర్వాత స్థానం కోల్పోయిన మార్క్‌ జుకర్‌బర్గ్‌

కాలిఫోర్నియా: వరుస వివాదాలకు కారణమైన ట్రంపరితనం చివరకు ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జూకర్‌బర్గ్‌కి ఎసరు తెచ్చింది. గతేడాది కాలంలో విద్వేష పూరిత వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్‌ను నిలువరించడంలో ఫేస్‌బుక్‌ ఉదాసీనంగా వ్యవహరించిందనే అభిప్రాయం ఆ సంస్థ ఉద్యోగులే వ్యక్తం చేశారు. దీంతో గ్లాస్‌డోర్‌ సంస్థ ప్రకటించిన టాప్‌ 100 సీఈవో లిస్టులో జుకరబర్గ్‌ స్థానం కోల్పోయారు.

టాప్‌లో దక్కని చోటు
ప్రముఖ కంపెనీలకు సీఈవోల పనితీరుపై ఆయా సంస్థలకు చెందిన చెందిన ఉద్యోగుల అభిప్రాయం సేకరించి ప్రతీ ఏడు 100 అత్యుత్తమ సీఈవోల జాబితాను గ్లాస్‌డోర్‌ సంస్థ ప్రకటిస్తోంది. 2013 నుంచి వరుసగా ప్రతీ ఏడాది ఈ జాబితాలో జుకర్‌బర్గ్‌కి చోటు దక్కింది. అయితే ఈ ఏడాది టాప్‌ 10 సీఈవో లిస్టులో చోటు దక్కించుకోలేకపోయాడు జుకర్‌బర్గ్‌. గ్లాస్‌డోర్‌ ప్రకటించిన టాప్‌ 100 సీఈవో లిస్టులో మైక్సోసాఫ్ట్‌ సత్య నాదేళ్ల 97 శాతం రేటింగ్‌ సాధించగా ఆపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ 95 శాతం రేటింగ్‌ సాధించారు. మార్క్‌ జుకర్‌బర్గ్‌కి 88 శాతం రేటింగ్‌ సాధించారు.

 

ట్రంపరితనమే కారణం 
అమెరికా అధ్యక్ష ఎన్నికలు, కాపిటల్‌ హౌజ్‌పై దాడి సందర్భంగా ఫేస్‌బుక్‌ వేదికగా విద్వేషపూరిత వ్యాఖ్యలు ట్రంప్‌ చేశారు. ట్రంప్‌ వ్యవహరశైలిపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ట్విట్టర్‌ ఏకంగా ట్రంప్‌ అకౌంట్‌ బ్యాన్‌ చేసింది. అయితే ఈ సమయంలో ట్రంప్‌పై చర్యలు తీసుకోవడంలో ఫేస్‌బుక్‌​ సీఈవో జుకర్‌బర్గ్‌ మెతక వైఖరి అనుసరించారనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కోవిడ్‌ కల్లోల సమయంలోనూ తప్పుడు సమాచారం నివారించడంలో ఫేస్‌బుక్‌ విఫలమైంది. ఫేస్‌బుక్‌ వేదికగా ఆధారంలేని సమాచారం జనబాహుళ్యంలోకి వెళ్లింది. వీటిని సకాలంలో నివారించడంలో ఫేస్‌బుక్‌ సీఈవో విఫలమైనట్టు ఆ సంస్థ ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. 

700 మంది 
ఫేస్‌బుక్‌కి ప్రపంచ వ్యాప్తంగా 60,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 700 మంది ఉద్యోగుల అభిప్రాయం గ్లాస్‌డోర్‌ సంస్థ సేరించింది. 2020 మే నుంచి 2021 మే వరకు సేకరించిన సమాచారం క్రోడీకరించి టాప్‌ సీఈవోల లిస్టును వెల్లడించింది. అయితే మరింత మంది ఉద్యోగుల నుంచి సమాచారం సేకరిస్తే జుకర్‌బర్గ్‌కి టాప్‌ 100 సీఈవో లిస్టులో చోటు దక్కేదని మార్క్‌ మద్దతుదారులు అంటున్నారు. 

చదవండి : ‘జెఫ్‌ బెజోస్‌ మారువేశంలో ఉన్న సూపర్‌ విలన్‌’
 

>
మరిన్ని వార్తలు