త్వరలోనే తప్పుకుంటా, అమెరికా కోర్టులో మస్క్‌ సంచలన ప్రకటన

17 Nov, 2022 17:50 IST|Sakshi

న్యూఢిల్లీ: 44 బిలియన్‌ డాలర్లకు ట్విటర్‌ను సొంతం చేసుకున్న బిలియనీర్‌, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ తాజాగామరో సంచలన విషయాన్ని వెల్లడించారు. తాను అసలు ఏం కంపెనీకి సీఈవోగా ఉండాలని కోరుకోవడం లేదని ఈ  క్రమంలోనే  త్వరలోనే ట్విటర్‌కు కొత్త సీఈవోను  ఎంపిక చేయనున్నామని ప్రకటించారు. అంతేకాదు మాజీ టెస్లా బోర్డు సభ్యుడు జేమ్స్ ముర్డోక్ ప్రకారం, మస్క్ టెస్లా  సీఈవోగా  కూడా వైదొలగాలని కూడా ఆలోచిస్తున్నారు. (ElonMusk మరో బాంబు: వన్‌ అండ్‌ ఓన్లీ అప్షన్‌, డెడ్‌లైన్‌)

ప్రపంచంలోని అత్యంత విలువైన వాహన తయారీ సంస్థ టెస్లా, రెండవ అతిపెద్ద రక్షణ కాంట్రాక్టర్ స్పేస్‌ఎక్స్, తాజాగా  అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన ట్విటర్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఎలాన్ మస్క్ బుధవారం డాలావర్‌ కోర్టుకు తెలిపారు.టెస్లా సీఈవోగా ఉన్నందుకు  2018లో 56 బిలియన్ డాలర్లు ప్యాకేజీ చెల్లింపులపై వచ్చిన ఆరోపణలపై  విచారణ సంద‍ర్భంగా  మస్క్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.  

టెస్లా, స్పేస్‌ఎక్స్ కంపెనీలకు సక్సెస్‌ఫుల్‌గా నడిపించాల్సిన  బాధ్యత తనదేననీ, అలాగే కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడంలో  కంపెనీ ఇంజనీర్ల పాత్ర చాలా ఎక్కువ అని  ప్రకటించారు.  ముఖ్యంగా టెస్లాను  విజయపథంలో నడిపించేందుకు విశేష కృషి చేసినందుకే ఆ చెల్లింపులను తన ‘పే’ను సమర్ధించుకున్నారు మస్క్. అలాగే తన ట్విటర్‌ బాధ్యతలు తాత్కాలికమేనని మస్క్ కోర్టుకు తెలిపారు. త్వరలోనే కొత్తవారికి బాధ్యతలను అప్పగిస్తానని ఈ వారంలో సంస్థాగత పునర్నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు  పేర్కొన్నారు. టెస్లా వాటాదారు రిచర్డ్ జే టోర్నెట్టా పిటిషన్‌తోపాటు, లాస్ ఏంజిల్స్ టెస్లా కారు క్రాష్ కేసు విచారణ సందర్భంగా ఎలన్ మస్క్ ఈ ప్రకటన చేశారు.  (Sandhya Devanathan: మెటా ఇండియా కొత్త బాస్‌, ప్రత్యేకతలివే!)

మరిన్ని వార్తలు