గురుప్రసాద్ మహాపాత్ర మృతి: పీఎం మోదీ సంతాపం

19 Jun, 2021 12:16 IST|Sakshi

కరోనాతో  డీపీఐఐటీ సెక్రటరీ డాక్టర్ గురుప్రసాద్  మహాపాత్ర మృతి

వాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్‌ సంతాపం  

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ట్వీట్‌

సాక్షి,ముంబై: కరోనా సంబంధిత సమస్యలతో పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి డాక్టర్ గురుప్రసాద్  మహాపాత్ర కన్నుమూశారు.ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన శనివారం కన్నుమూశారు.  గురుప్రసాద్‌ మరణంపై ప్రధానమంతత్రి నరేంద్ర మోదీ ట్విటర్‌ ద్వారా సంతాపం తెలిపారు. అలాగే వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ గురుప్రసాద్‌ మృతిపై  విచారాన్ని వ్యక్తం చేశారు. మహాపాత్రను కోల్పోయినందుకు చాలా బాధగా ఉందనీ సుదీర్ఘకాలంపాటు, దేశానికి ఎనలేని సేవలందించారని ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగానికి ఆయన కుటుంబానికి స్నేహితులకు సానుభూతిని తెలిపారు. అటు ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్‌ కూడా సంతాపం వెలిబుచ్చారు. అత్యంత సమర్థవంతమైన, డెడికేటెడ్‌ అధికారిని కోల్పోవడం విచారకరమని పేర్కొన్నారు. 

కాగా కోవిడ్‌-19 కారణంగా ఏప్రిల్ నెలలో ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు. అయినా కోవిడ్‌ అనంతర సమస్యల కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విచారు. గుజరాత్ కేడర్ 1986 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన గురుప్రసాద్‌ 2019 ఆగస్టులో డీపీఐఐటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చైర్మన్‌గా పనిచేశారు. రాష్ట్ర స్థాయిలో గుజరాత్‌లోని సూరత్‌లో మునిసిపల్ కమిషనర్ పదవిని నిర్వహించిన వాణిజ్య విభాగంలో జాయింట్ సెక్రటరీగా తన సేవలను అందించారు. 

మరిన్ని వార్తలు