అదిరిపోయే గాడ్జెట్‌తో ఇంట్లో దుర్వాసనకు చెక్‌ పెట్టండిలా

4 Dec, 2022 11:11 IST|Sakshi

ఇదో కొత్తతరహా ఎయిర్‌ప్యూరిఫయర్‌. మార్కెట్‌లో దొరికే మిగిలిన ఎయర్‌ప్యూరిఫయర్ల కంటే ఇది చాలా తేలిక. పోర్టబుల్‌ టేబుల్‌ఫ్యాన్‌ పరిమాణంలో ఉండే దీనిని ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. కోరుకున్న చోట తేలికగా అమర్చుకోవచ్చు. ఇళ్లలోను, కార్యాలయాల్లోను వాడుకోవడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది.

‘డాక్టర్‌ ఎయిర్‌పిక్‌’ పేరిట దక్షిణ కొరియాకు చెందిన బహుళజాతి సంస్థ పిక్సెల్‌రో కంపెనీ ఇటీవల దీనిని మార్కెట్‌లోకి తెచ్చింది. ఇందులోని కార్బన్‌ మల్టీకంపోజిట్‌ ఫిల్టర్, ప్లాస్మా డీయాడరైజర్లు గాలిలోని దుమ్ము ధూళి, పొగ, సూక్ష్మజీవకణాలు వంటివి తొలగించడమే కాకుండా, పరిసరాల్లోని ఎలాంటి దుర్వాసననైనా నిమిషాల్లో మటుమాయం చేస్తాయి. దీని ధర 75 డాలర్లు (రూ.6,134) మాత్రమే! ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్లలో దొరుకుతోంది.  

మరిన్ని వార్తలు