డిజిటల్‌ బిల్లు ముసాయిదా కమింగ్‌ సూన్‌

9 Dec, 2022 13:52 IST|Sakshi

న్యూఢిల్లీ: డిజిటల్‌ ఇండియా బిల్లు ముసాయిదా డిసెంబర్‌ ఆఖరు కల్లా సంప్రదింపుల కోసం సిద్ధం కాగలదని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. వ్యక్తిగతయేతర డేటా యాజమాన్య అధికారాలు, డేటా పోర్టబిలిటీ తదితర అంశాలు కూడా ఇందులో ఉంటాయని ఆయన వివరించారు. సమకాలీనమైనదిగా, అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్‌ ఇండియా చట్టం ఉంటుందని మంత్రి చెప్పారు. 22 ఏళ్ల నాటి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం స్థానంలో కేంద్రం దీన్ని ప్రవేశపెట్టనుంది.

ప్రభుత్వం ఇటీవలే డిజిటల్‌ వ్యక్తిగత డేటా భద్రత (డీపీడీపీ) బిల్లు ముసాయిదా విడుదల చేసింది. మరోవైపు, ’వేరబుల్స్‌’ (వాచీలు మొదలైనవి)కి కూడా ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాన్ని వర్తింప చేసే యోచన ఉందని చంద్రశేఖర్‌ చెప్పారు. ఎలక్ట్రానిక్స్‌ రంగంలో వేరబుల్స్‌ విభాగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని తెలిపారు.

మరిన్ని వార్తలు