వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు!

1 Oct, 2021 18:07 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు తీపికబురు అందించింది. వాలిడిటీ ముగిసిపోయిన మోటార్ వెహికల్ డాక్యుమెంట్ల గడువును పొడిగించింది. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. సెప్టెంబర్ 30 వరకు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ (డిఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్‌సీ) వంటి పలు వాహన సంబందిత డాక్యుమెంట్ల గడువును తాజాగా అక్టోబర్ 31, 2021 వరకు పొడిగించింది. దీనికి సంబందించి రోడ్డు & రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. 

"కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా ఫీట్ నెస్, పర్మిట్(అన్ని రకాల), లైసెన్స్, రిజిస్ట్రేషన్ ఏదైనా ఇతర సంబంధిత డాక్యుమెంట్(ల) గడువును 30 సెప్టెంబర్ 2021 వరకు పొడగించినట్లు" ట్విటర్ ద్వారా కేంద్రం తెలిపింది.ఈ క్లిష్ట సమయంలో పనిచేస్తున్న పౌరులు, రవాణాదారులు అసౌకర్యానికి గురికాకుండా చూసేలా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలని రోడ్డు & రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. మోటారు వాహనాల చట్టం, 1988 & సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్, 1989కు సంబంధించిన మోటార్ వెహికల్ డాక్యుమెంట్ల పొడిగించింది. గత ఏడాది మార్చిలో వచ్చిన మహమ్మారి కారణంగా అప్పటి నుంచి వీటి గడువును 6 సార్లు పొడిగించింది.

చదవండి: అమెజాన్‌లో మొబైల్స్‌పై అదిరిపోయే ఆఫర్స్!

మరిన్ని వార్తలు