విప్లవాత్మక ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను ఆవిష్కరించిన దుబాయ్‌ కంపెనీ..! రేంజ్‌లో కూడా అదుర్స్‌..! 

1 Apr, 2022 11:54 IST|Sakshi

Rena Max Electric Scooter: ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు భారీ ఆదరణ లభిస్తోంది. అంతేకాకుండా పలు ఆన్‌లైన్‌ డెలివరీ సంస్థలు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలను వాడేందుకు ప్రణాళికలను రచిస్తున్నాయి. కాగా తాజాగా దుబాయ్‌కు చెందిన మొబిలిటీ స్టార్టప్‌ బార్క్‌ (Barq) విప్లవాత్మక ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ రెనా మ్యాక్స్‌ను రూపొందించింది. లాస్ట్‌ మైల్‌ డెలివరీ సేవలను అందించే సంస్థలకు అనుగుణంగా బార్క్‌ రెనా మ్యాక్స్‌ను కంపెనీ రూపొందించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. 

జాగ్వార్‌ కార్ల డిజైన్లపై పనిచేసిన ఇయాన్ కల్లమ్  బార్క్‌ రెనా మ్యాక్స్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కు డిజైన్‌ను రూపొందించారు. ఇది హాలీవుడ్‌ సినిమా ట్రాన్‌లోని బైక్‌ మోడల్‌ను పోలి ఉంది. ఈ స్కూటర్‌ కోటెడ్ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్‌తో రానుంది. లైటింగ్ విషయానికొస్తే, స్కూటర్ చుట్టూ పూర్తి-LED లైట్లను కల్గి ఉంది.

 

ప్రపంచవ్యాప్తంగా రెనా మ్యాక్స్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు 2022 చివరి నాటికి అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. 2025లోపు అన్ని దేశాల్లో లాంచ్‌ చేయాలని బార్క్‌ భావిస్తోంది. కాగా వీటిని లీజింగ్‌ పాలసీ ద్వారా సదరు డెలివరీ కంపెనీలకు అందించేందుకు కంపెనీ ప్రణాళికలను రచిస్తోంది.  ఈ స్కూటర్‌ ధరను ఇంకా ప్రకటించలేదు.  

రేంజ్‌ విషయానికి వస్తే..!
బార్క్‌ రెనా మ్యాక్స్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ 5.6 kWh బ్యాటరీ సామర్థ్యంతో రానుంది. ఇది 151కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తోందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ స్కూటర్‌లో స్వాపబుల్‌ బ్యాటరీని అమర్చారు. రెనా మ్యాక్స్‌ గంటకు 60 మైళ్ల గరిష్ట వేగంతో ప్రయాణించనుంది. ఈ స్కూటర్‌ 79 లీటర్‌ బూట్‌స్పేస్‌తో రానుంది. 

చదవండి: హల్‌చల్‌ చేస్తోన్న టాటా మోటార్స్‌ కొత్త ఎలక్ట్రిక్‌ కారు..! లాంచ్‌ ఎప్పుడంటే..?

మరిన్ని వార్తలు