Ducati Panigale:డుకాటి పనిగలే సరికొత్తగా ...! ధర ఎంతంటే..!

22 Nov, 2021 22:27 IST|Sakshi

ప్రముఖ ఇటాలియన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం డుకాటి భారత మార్కెట్లలోకి సరికొత్త అప్‌డేట్డ్‌ వెర్షన్‌ బైక్‌ను లాంచ్‌ చేసింది. వీ4 శ్రేణిలో ‘డుకాటి పనిగలే వీ4 ఎస్‌పీ’ టాప్-ఆఫ్-ది-లైన్ వెర్షన్‌ బైక్‌ను డుకాటి ఇండియా విడుదల చేసింది. 2021డుకాటి పనిగలే వీ4 ఎస్‌పీ ధర 36.07 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా ఉంది. దీని ధర డుకాటి వీ4 ఎస్‌ బైక్‌ మోడల్‌ కంటే ఎక్కువ. ట్రాక్‌ఫోకస్డ్‌, తేలికైన బైక్‌ మోడల్‌గా డుకాటి పనిగలే నిలవనుంది. ఇందులో తేలికైన అల్లాయ్ వీల్స్‌తో పాటుగా కార్బన్ ఫైబర్‌తో బైక్‌ బాడీను రూపొందించారు. దీంతో సుమారు 1.4 కిలోల బరువు తగ్గింది. 
చదవండి: బిఎమ్‌డబ్ల్యు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

డుకాటి పనిగలే స్టాండర్డ్‌ వెర్షన్‌ డిజైన్‌ను వీ4 ఎస్‌పీ పొందనుంది.  అయితే ఈ బైక్‌ ప్రత్యేకమైన 'వింటర్ టెస్ట్' డిజైన్‌తో రానుంది. ఈ కొత్త డిజైన్‌ మోటోజీపీ, ఎస్‌బీకే మోటర్‌సైకిళ్ల ప్రేరణతో రూపొందించారు. ఫ్యూయల్ ట్యాంక్‌పై ఎరుపు రంగుతో, బ్రష్డ్-అల్యూమినియం ఫినిషింగ్‌తో రానుంది. డుకాటి పనిగలే ఇంజిన్‌ విషయానికి వస్తే... డెస్మోసెడిసి స్ట్రాడేల్ 1103 సీసీ  ఇంజిన్‌తో రానుంది. ఇది 13000 ఆర్‌పీఎమ్‌ వద్ద 211 బీహెచ్‌పీ ఉత్పత్తి చేస్తోంది. 9500ఆర్‌పీఎమ్‌ వద్ద 124ఎన్‌ఎమ్‌ గరిష్ట టార్క్‌ను విడుదల చేయనుంది. ఈ బైక్‌లో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు.

ఈ బైక్‌ ఓపెన్ కార్బన్ ఫైబర్ క్లచ్ కవర్, లైసెన్స్ ప్లేట్ రిమూవల్ ప్లగ్,  మెషిన్డ్ మిర్రర్ బ్లాక్-ఆఫ్ ప్లేట్‌లను కలిగి ఉంది. ఈ బైక్‌లో ప్రత్యేక ఆకర్షణగా డేటా ఎనలైజర్+జీపీఎస్‌ మాడ్యూల్‌ను ఏర్పాటుచేశారు. క్విక్‌షిఫ్టర్, రైడింగ్ పవర్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, లాంచ్ కంట్రోల్ వంటి మరిన్నింటితో సహా అనేక ఎలక్ట్రానిక్ ఎయిడ్‌లతో రానుంది.
చదవండి: అరె డాల్ఫిన్‌లా ఉందే, వరల్డ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ రికార్డ్‌లను తుడిచి పెట్టింది

మరిన్ని వార్తలు