90 శాతం ఉద్యోగాలు ఫట్‌: సిగ్గూ, శరం, మానవత్వం లేదా? సీఈవోపై పైర్‌

11 Jul, 2023 16:38 IST|Sakshi

ప్రోగ్రామింగ్ అనుభవం లేని వ్యాపారులు తమ స్వంత ఇ-కామర్స్ స్టోర్‌ని సెటప్ చేసుకోవడానికి అనుమతించే DIY  ప్లాట్‌ఫారమ్  దుకాన్‌ ఏఐ కారణంగా తన ఉద్యోగులను తగ్గించుకుంటున్న తాజా కంపెనీగా మారింది ఇ-కామర్స్ స్టార్టప్ దుకాన్‌ ఉద్యోగుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. కస్టమర్ సపోర్ట్ టీమ్‌లో 90 శాతం ఉద్యోగుల స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌ను  రీప్లేస్‌ చేసింది. (రిటెన్షన్‌ బోనస్‌తో సీఈవో లగ్జరీ విల్లా: ఇపుడు ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌)

ఈ విషయాన్ని దుకాన్‌  ఫౌండర్‌, సీఈవో  సుమిత్ షా  ట్విటర్లో  వెల్లడించారు. లాభదాయకతకు ప్రాధాన్యమివ్వడమే ఈ నిర్ణయానికి కారణమని పేర్కొంటూ, కస్టమర్ సపోర్ట్‌ ఖర్చులు 85 శాతం తగ్గాయన్నారు. అలాగే కస్టమర్ సపోర్ట్ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ఏఐ చాట్‌బాట్‌తో టైం బాగా తగ్గిందని వెల్లడించారు. (అదరగొట్టేస్తున్న యాంకరమ్మ: దిమ్మతిరిగే వీడియో హల్‌చల్‌)

చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టిన  రిజల్యూషన్ సమయం మునుపటి 2 గంటల 13 నిమిషాల నుండి 3 నిమిషాల 12 సెకన్లకు తగ్గిందని సుమీత్‌ షా ట్విటర్‌లో వెల్లడించారు. లీనా అనే చాట్‌బాట్ 1400 మద్దతు టిక్కెట్‌లను పరిష్కరించినట్లుగా గుర్తించామనీ,  డుకాన్‌లో  ఏఐ విప్లవానికి ఇది  నాంది అని షా చెప్పారు. 90శాతం టీంను తొలగించడం  కఠినమైనదే కానీ అవసరమైన నిర్ణయం అంటూ తన చర్చను సమర్ధించు కున్నారు.  దీంతో ట్విటర్‌లో ఆయనపై విమర్శలు  చెలరేగాయి.  (దేశంలో రిచెస్ట్‌ గాయని ఎవరో తెలుసా?ఏఆర్‌ రెహమాన్‌తో పోలిస్తే?)

తొలగించిన సిబ్బందికి ఏదైనా సహాయం అందించారా అనినొక యూజర్‌ అడిగారు.  లేఆఫ్‌లపై మరిన్ని వివరాలను తన రాబోయే లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో వెల్లడిస్తానని షా తెలిపారు.  అసలు మానవత్వంలేదు, సిగ్గు, సెన్సిటివిటీ లేదు అంటూ  ట్వీపుల్‌ దుమ్మెత్తి పోశారు. ఉద్యోగులకు తొలగించడం అనేది బాధాకరమైన విషయం ఇందులో గర్వపడాల్సింది ఏముంది అంటూ మండిపడ్డారు. మీ​ ఉద్యోగులను తలచుకుంటే జాలిగా ఉంది. కానీ మీతో  పని చేయాల్సిన అవసరం లేనందుకు సంతోషంగా కూడా ఉంది  అని ఒక యూజర్‌ రాశారు. మీకు అసలు జాలి దయ లేదంటూ మరోకరు తమ ఆగ్రహాన్ని ట్విటర్‌ ద్వారా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు