వాఫీ డే .. ప్రత్యేకత ఏంటో తెలుసా ?

3 Jul, 2021 16:37 IST|Sakshi

‘డ్యూక్స్’ ఆధ్వర్యంలో వాఫీ డే వేడుకలు

1999 జులై 3న మార్కెట్‌లోకి వచ్చిన వాఫీలు 

హైదరాబాద్: పెద్దలు కాఫీలను ఇష్టపడితే చిన్న పిల్లలు వాఫీలను ఇష్టపడుతారు. అందుకే ప్రతీ ఏడు జులై 3న వాఫీ డేను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది డ్యూక్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నగరంలో వాఫీ డే వేడుకలు నిర్వహించారు. వాఫీ రుచులను ప్రతిబింబించేలా పలు కార్యక్రమాలను చేపట్టింది. క్షేత్రస్థాయిలో కార్యక్రమాలతోపాటు డిజిటల్‌ , రేడియో మాధ్యమాల ద్వారా వాఫీ డే  ప్రచారాన్ని డ్యూక్‌ నిర్వహిస్తోంది.


వాఫీ డే స్పెషల్‌
డ్యూక్స్ బ్రాండ్ బిస్కట్స్.. మొదటిసారిగా 1999 జూలై 3న వాఫీని మార్కెట్లోకి తీసుకొచ్చింది.  బేకరీ ఐటమ్స్‌ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్న వాటిలో వాఫీ కూడా ఒకటిగా నిలిచింది. అందుకే  వాఫీ మార్కెట్‌లోకి వచ్చిన రోజును ‘వాఫీ డే’గా జరుపుతున్నారు.

9 రుచుల్లో
డ్యూక్స్ వాఫీ 9 రకాల రుచుల్లో లభిస్తోంది. క్రీమ్‌తో నిండిన వాఫీలు చిరువేడుకల్లో, ప్రయాణాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. రవి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఎఫ్‌పీఎల్) ఆధ్వర్యంలో డ్యూక్స్ బ్రాండ్ పేరుతో వాఫీలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆదరాభిమానాలు అందుకుంటోంది. 
 

మరిన్ని వార్తలు