స్పెషల్‌ కోర్స్‌, యూనివర్సిటీలో టిక్‌ టాక్‌ పాఠాలు!

22 May, 2022 17:07 IST|Sakshi

ట్రెండ్‌ మారింది. సాధారణంగా ఎడ్యుకేషన్‌ పూర్తయిన తర్వాత జాబ్, లేదంటే బిజినెస్‌ చేస్తూ డబ్బులు ఎలా సంపాదించాలనే విషయాల గురించి ఆలోచిస్తుంటాం. కానీ నేటి తరం యువత అలా కాదు. కాలేజీలో ఉండగానే ఎలాంటి బిజినెస్‌ చేయాలి.ఎంత సంపాదిస్తే ఫ్యూచర్‌ బాగుంటుందనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఆ ప్రయత్నాలకు తగ్గట్లు అమెరికాకు చెందిన డ్యూక్‌ యూనివర్సిటీ ఆఫ్‌ డర్హామ్‌ విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా టిక్‌ టాక్‌ కోర్స్‌ను ప్రారంభించింది. ఇందులో ప్రముఖంగా టిక్‌ టాక్‌ను ఉపయోగించి దాని ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలనే విషయాల గురించి విద్యార్ధులకు క్లాస్‌లు చెబుతున్నారు యూనివర్సిటీ ప్రొఫెసర్లు.   

ఈ క్లాసుల్లో టిక్‌టాక్‌ వీడియోలు ఎలా తీయాలి? వాటిని ఎలా ప్రమోట్‌ చేసుకోవాలి.ఎలా ప్రమోట్‌ చేస్తే ఎక్కువ మందికి రీచ్‌ అవుతుంది. పర్సనల్‌ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసుకొని ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించవచ్చో' అని టిక్‌ టాక్‌ కోర్స్‌ను అందుబాటులోకి తెచ్చిన ప్రొఫెసర్‌ ఆరోన్‌ డినిన్‌ క్లుప్తంగా వివరిస్తున్నారు. అంతేకాదండోయ్‌ కోర్స్‌ నేర్చుకునే సమయంలో ప్రొఫెసర్‌ క్లాసులు వింటున్న విద్యార్ధులు టిక్‌ టాక్‌ వీడియోలు చేసి వాటికి వచ్చే వ్యూస్‌, బ్రాండ్‌ ప్రమోషన్‌లతో నెలకు రూ.4లక్షలకు పైగా సంపాదింస్తున్నట్లు ఆరోన్‌ డినిన్‌ చెబుతున్నారు.

మరిన్ని వార్తలు