హైదరాబాద్‌: మైండ్‌బ్లోయింగ్‌ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు.. లేట్‌ చేయకండమ్మా!

2 Oct, 2022 08:22 IST|Sakshi

లాట్‌ దసరా, దీపావళి ధమాకా ఆఫర్లు
మొబైల్‌ రిటైల్‌రంగంలో ఏపీ, తెలంగాణల్లో వేగంగా విస్తరించిన మల్టీబ్రాండ్‌ మొబైల్‌ రిటైల్‌ చైన్‌ లాట్‌ మొబైల్స్‌ దసరా, దీపావళి ధమాకా ఆఫర్లను ప్రారంభించింది.  అన్ని బ్రాండెడ్‌ మొబైల్స్, స్మార్ట్‌ టీవీలు, ల్యాప్‌టాప్స్, స్మార్ట్‌ వాచెస్, హోం థియేటర్‌ వంటివి అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

ప్రతి స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలుపై ఫైర్‌ బోల్ట్‌ కాలింగ్‌ వాచ్, టవర్‌ ఫ్యాన్, టీడబ్ల్యూఎస్‌ ఎయిర్‌ పాడ్స్, పోర్టబుల్‌ స్పీకర్, నెక్‌బ్యాండ్‌ హోం థియేటర్‌ కాంబో ఆఫర్లు లభిస్తాయన్నారు. స్మార్ట్‌ టీవీ రూ.8,999, ల్యాప్‌టాప్స్‌ రూ.17,499కే లభిస్తాయని తెలిపారు.   

ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ ఆఫర్ల వర్షం
దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. ఈ పండుగలకు సంప్రదాయంతోపాటు ఆధునికత ఉట్టిపడే సరికొత్త వస్త్రాలతోపాటు నగలనూ పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచినట్లు ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ పర్వదినాలను తెలుగు మహిళలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. షాపింగ్‌ చేసిన వారికి 2.5 కేజీల బంగారం, 80 కేజీల వెండి, 150 శాంసంగ్‌ టీవీలు, 600 గ్రైండర్లు, 1,375 ఎలక్ట్రిక్‌ కుక్కర్లతోపాటు మరెన్నో బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది.

సౌత్‌ ఇండియా డిస్కౌంట్లు
దసరా, దీపావళి పండుగల సందర్భంగా సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ ఆకర్షణీయమైన డిస్కౌంట్స్‌ను అందజేస్తోంది. చీరలు, మెన్స్‌వేర్‌పై డిస్కౌంట్‌తోపాటు అతి తక్కువ తరుగుతో బంగారు ఆభరణాలను, తరుగు, మజూరీ లేని వెండి ఆభరణాలను అందుబాటులో ఉంచినట్టు సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ డైరెక్టర్‌ పి.వి.ఎస్‌.అభినయ్‌ తెలిపారు.

దసరా–దీపావళి లక్కీ బంపర్‌డ్రాలో భాగంగా రూ.ఆరుకోట్ల విలువైన బహుమతులను రెండువేల మంది విజేతలకు అందజేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా ఈనెల 5న, దీపావళి సందర్భంగా ఈనెల 25న బంపర్‌డ్రా ఫలితాలు వెల్లడించినున్నట్లు ఆయన తెలిపారు.

చదవండి: చైనా స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ షావోమీకి కేంద్రం భారీ షాక్‌!

మరిన్ని వార్తలు