e-Sprinto Amery: మార్కెట్‌లోకి మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఒక్కసారి చార్జి చేస్తే 140 కిలోమీటర్లు..

25 May, 2023 08:53 IST|Sakshi

న్యూఢిల్లీ: విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ఈ–స్ప్రింటో కొత్తగా ఎమెరీ పేరిట ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఒక్కసారి చార్జి చేస్తే 140 కిలోమీటర్ల రేంజి (మైలేజీ) ఇస్తుంది. 6 సెకన్ల వ్యవధిలోనే గంటకు 0–40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని, గరిష్టంగా గంటకు 65 కి.మీ. వేగంతో ప్రయాణించగలదని సంస్థ తెలిపింది.

ఇదీ  చదవండి: Uber Green: ఉబర్‌లో సరికొత్త సేవలు.. తొలుత ఆ మూడు నగరాల్లో ప్రారంభం

ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో 20–35 ఏళ్ల వయస్సు గల చోదకులు లక్ష్యంగా దీన్ని రూపొందించామని పేర్కొంది. ఇందులో రిమోట్‌ కంట్రోల్‌ లాక్, యాంటీ–థెఫ్ట్‌ అలారం, మొబైల్‌ చార్జింగ్‌ సాకెట్‌ తదితర ఫీచర్లు ఉంటాయని సంస్థ సహ వ్యవస్థాపకుడు అతుల్‌ గుప్తా తెలిపారు. దీని ప్రారంభ ధర రూ. 1,29,999 (ఎక్స్‌ షోరూం)గా ఉంటుంది.

ఇదీ చదవండి: భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్‌ టూవీలర్ల అమ్మకాలు.. కారణం ఇదే..

మరిన్ని వార్తలు