ట్యాక్స్‌ పేయర్స్‌కు అలర్ట్‌! ఏప్రిల్‌ 1 నుంచే ఐటీఆర్‌ ఫైలింగ్‌..

16 Feb, 2023 12:15 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022–23) నూతన రిటర్నులు (ఐటీఆర్‌లు) ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి  తెలిపింది. దీంతో అసెస్‌మెంట్‌ సంవత్సరం మొదటి రోజు నుంచే (2023 ఏప్రిల్‌ 1) రిటర్నులు దాఖలు చేసుకోవడం వీలవుతుంది. 

గతేడాదితో పోలిస్తే, ఐటీఆర్‌లలో పెద్దగా మార్పులు చేయలేదని తెలిపింది. ఆదాయపన్ను చట్టం 1961లో చేసిన సవరణల మేరకు స్వల్ప మార్పులను ప్రవేశపెట్టినట్టు స్పష్టం చేసింది. ఐటీఆర్‌ 1 నుంచి ఐటీఆర్‌ 7 వరకు పత్రాలను సీబీడీటీ నోటిఫై చేయడం తెలిసిందే. సాధారణంగా ఏటా మార్చి లేదా ఏప్రిల్‌లో ఐటీఆర్‌లను నోటిఫై చేస్తుంటారు. ఈ విడత ముందుగానే ఈ ప్రక్రియను సీబీడీటీ పూర్తి చేసింది.

(ఇదీ చదవండి: ఎఫ్‌డీ కస్టమర్లకు ఎస్‌బీఐ గుడ్‌ న్యూస్‌! వడ్డీ రేట్లు పెంపు..)

మరిన్ని వార్తలు