Amazon: నాలుగు గంటలు పనిచేస్తే చాలు రూ. 60 వేలు మీ సొంతం..!

19 Jul, 2021 18:47 IST|Sakshi

కరోనా మహమ్మారి రాకతో ఈ-కామర్స్ వ్యాపారం గణనీయంగా వృద్ధి చెందింది. ప్రముఖ ఈ-కామర్స్‌  దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌ కొనుగోలుదారులకు మరింత వేగంగా వస్తువులను డెలివరీ చేయడానికి వ్యూహాలను రచిస్తున్నాయి. అందులో భాగంగా అమెజాన్‌ డెలివరీ సేవలను మరింత విస్తృత పరిచేందుకు డెలివరీ బాయ్స్‌లను నియమించనుంది. డెలివరీ బాయ్స్‌కు ఫిక్స్‌డ్‌ సాలరీగా ప్రతినెలా అమెజాన్‌ రూ 12 వేల నుంచి రూ. 15 వేల వరకు అందిస్తోంది. 

అమెజాన్‌ ఒక ప్రకటనలో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు నెలలో రోజూ 4 గంటలు పనిచేయడంతో సుమారు రూ.55 వేల నుంచి 60 వేల వరకు వస్తాయని పేర్కొంది. అది ఏలా అంటే అమెజాన్‌ ప్రకారం.. డెలివరీ బాయ్స్‌కు అత్యధిక సాలరీలు వారి డెలివరీ ప్యాకేజ్‌లపై ఆధారపడి ఉంటుంది. ఒక  ప్యాకేజ్‌ డెలివరీ చేస్తే ప్యాకెజ్‌పై సుమారు రూ. 10 నుంచి రూ. 15 కమిషన్‌ వస్తోంది. ఇలా ఒక రోజులో సుమారు 100 నుంచి 150 ప్యాకేజ్‌లను డెలివరీ చేస్తే  నెలకు గరిష్టంగా రూ. 60 వేలను పొందవచ్చును. కంపెనీ ప్రకారం ప్యాకేజీల డెలివరీ 10కి.మీ నుంచి 15 కి.మీ దూరంలో ఉంటుందని పేర్కొంది. దీంతో ప్యాకేజ్‌లను సుమారు నాలుగు నుంచి ఐదు గంటల్లో డెలివరీ చేయవచ్చును. 

మరిన్ని వార్తలు