ఈజ్‌ మై ట్రిప్‌ చేతికి ‘చెకిన్‌’

28 Jan, 2023 07:27 IST|Sakshi

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ ట్రావెల్‌ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ అయిన ఈజ్‌మైట్రిప్‌ ‘చెకిన్‌’ కంపెనీలో 55 శాతం వాటాను కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. చెకిన్‌ అన్నది పర్యాటకులు ఎలాంటి బేరమాడే అవసరం లేకుండా హోటల్‌ బుకింగ్‌లపై డిస్కౌంట్‌కు వీలు కల్పించే రియల్‌టైమ్‌ మార్కెట్‌ ప్లేస్‌. ఆల్గోరిథమ్‌ ఆధారితంగా టాప్‌–5 హోటల్‌ చెకిన్‌ ఆఫర్‌లను ఇది అందించగలదు. చెల్లింపులు మాత్రం హోటల్‌ వద్దే చేయవచ్చు.

మరోవైపు చెకిన్‌ యాప్‌ యాక్సెస్‌ను హోటల్‌ వారికి ఈజ్‌మైట్రిప్‌ అందించనుంది. దీని ద్వారా వారు ఎప్పటికప్పుడు త మ బుకింగ్‌లు, డిమాండ్‌ తీరును తెలుసుకుని, ధరలను నియంత్రించుకోవచ్చని ఈజ్‌మైట్రిప్‌ తెలిపింది. తద్వారా తమ ప్రాపర్టీలను వేగంగా విక్రయించుకోగలరని (బుకింగ్‌లు) పేర్కొంది.

చదవండి: Union Budget 2023: కేవలం 800 పదాల్లో బడ్జెట్‌ను ముగించిన ఆర్థిక మంత్రి.. ఎవరో తెలుసా!

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు