రేపు మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. కి.మీకు 20-50 పైసలు ఖర్చు

24 Aug, 2021 17:33 IST|Sakshi

ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి వారానికి ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వస్తుంది. ఆగస్టు 15న ఎలక్ట్రిక్ మార్కెట్లోకి వచ్చిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్, సింపుల్ ఎనర్జీ వన్ ఒక ట్రెండ్ సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ వేహికల్ స్టార్టప్ ఈబైక్ గో తన మొదటీ ఎలక్ట్రిక్  స్కూటర్​ను రేపు(ఆగస్టు 25న) మార్కెట్లోకి తీసుకోని రానున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి రేపు రాబోయే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా శక్తివంతమైనది అని కంపెనీ పేర్కొంది.

రాబోయే రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొనిరానున్నట్లు సంస్థ పేర్కొంది. ఈబైక్ గో ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా భారతదేశంలో తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. దీనిని తయారు చేయడం కోసం కంపెనీ గత మూడు సంవత్సరాలుగా తీవ్రంగా కృషి చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈబైక్ గో దేశవ్యాప్తంగా ఐదు ప్రధాన నగరాల్లో 3,000 ఐఒటీ ఆధారిత పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను త్వరలో నిర్మించనున్నట్లు ప్రకటించింది. స్కూటర్ ఛార్జింగ్ కోసం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని తెలిపింది. ఛార్జింగ్ స్టేషన్లలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం కిలోమీటరుకు 20-50 పైసలు ఖర్చు కానున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఛార్జింగ్ స్టేషన్ల వద్ద యుపీఐ, క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా డబ్బులు చెల్లించవచ్చు.(చదవండి: ఆ విషయంలో అమెరికాను వెనక్కి నెట్టిన ఇండియా)

మరిన్ని వార్తలు