విమానయానం, ఆక్సిజన్‌ ప్లాంట్లకూ రుణ హామీ..

31 May, 2021 20:45 IST|Sakshi

ముంబై: అత్యవసర రుణ హామీ పథకం(ఈసీఎల్‌ జీఎస్‌) కింద ఇంకా రూ.45,000 కోట్ల మంజూరీకి బ్యాంకింగ్‌కు అవకాశం ఉందని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) సునిల్‌ మెహతా ప్రకటించారు. ఈ పథకానికి కేంద్రం రూ.3,00,000 కోట్లు కేటాయించింది. ఇందులో ఇప్పటికే రూ.2.54 లక్షల కోట్లను బ్యాంకింగ్‌ మంజూరీ చేసిందని ఆయన తెలిపారు. ఈ పథకం వర్తించే విభాగాల జాబితాను పెంచినట్లు ఆర్థికశాఖ చేసిన ప్రకటన అనంతరం మెహతా తాజా ప్రకటన చేశారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు హాస్పిటల్స్, నర్సింగ్‌ హోమ్‌లకు ఈ రాయితీ వడ్డీ (7.5 శాతం) రుణాలను అందజేయవచ్చని ఆర్థికశాఖ తాజాగా ప్రకటించింది. అలాగే పౌర విమానయానం విభాగానికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తున్న ట్లు తెలిపింది.

రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రారంభం!
ఆర్‌బీఐ ఈనెలారంభంలో ఇచ్చిన నిర్దేశాలకు అనుగుణంగా రూ.25 కోట్ల వరకూ రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియను బ్యాంకులు ప్రారంభించినట్లు ఉన్నత వర్గాలు తెలిపాయి. బ్యాంక్‌ బోర్డులు సంబంధిత నిర్ణయాన్ని ఆమోదించి, ఈ పథకం వర్తించే వారికి తెలియజేస్తున్నట్లు సమాచారం.

చదవండి: 

రూ.50 వేలు దాటేసిన బంగారం ధర

మరిన్ని వార్తలు