Abhijit Sen: ప్రఖ్యాత వ్యవసాయ ఆర్థికవేత్త గుండెపోటుతో కన్నుమూత

30 Aug, 2022 11:10 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రఖ్యాత వ్యవసాయ ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ప్రొఫెసర్ అభిజిత్ సేన్ (72) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా సోమవారం అర్థరాతత్రి కన్నుమూశారని అభిజిత్‌  సేన్‌ సోదరుడు  డాక్టర్ ప్రణబ్ సేన్  ప్రకటించారు.  తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆయను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయిందని, అప్పటికే ఆయన మరణించారని తెలిపారు.  ఆయన మరణంపై  రాజకీయ ప్రముఖులు, ఆర్థిక ,వ్యవసాయరంగ నిపుణులు  పలువురు  సంతాపం ప్రకటించారు.

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో 2004 నుంచి 2014 వరకు ప్రణాళికా సంఘం సభ్యుడిగా ఉన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని తొలి ఎన్‌డిఎ ప్రభుత్వంలో వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సిఎసిపి) ఛైర్మన్‌గా అభిజిత్ సేన్, జూలై 2000లో సమర్పించిన రిపోర్ట్‌  ప్రముఖంగా నిలిచింది.

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా పొంది, నాలుగు దశాబ్దాల కరియర్‌లో అభిజిత్ సేన్ న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రాన్ని బోధించేవారు. అంతకుముందు  ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ , ఎసెక్స్‌లలో కూడా ఎకానమిక్స్‌ బోధించారు. వ్యవసాయ ఖర్చులు  అండ్‌ ధరల కమిషన్ అధ్యక్షుడు సహా అనేక ముఖ్యమైన ప్రభుత్వ పదవులను  ఆయన నిర్వహించారు. సేన్‌కు భార్య జయతి ఘోష్‌(దివైర్‌ డిప్యూటీ ఎడిటర్), కుమార్తె జాహ్నవి సేన్ ఉన్నారు. 

మరిన్ని వార్తలు