నిబంధనల ఉల్లంఘన, ప్లిప్‌ కార్ట్‌కు భారీ జరిమానా

5 Aug, 2021 11:46 IST|Sakshi

ప‍్రముఖ ఈకామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌ కార్ట్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ) భారీ షాక్‌ ఇచ్చింది. విదేశీ పెట్టుబడుల చట్టంలోని నిబంధనల్ని ఉల్లంఘించినందుకు గాను ఈడీ..ఫ్లిప్‌ కార్ట్‌కు 100 బిలియన్‌ డాలర్ల ఫైన్‌ విధించింది.

గత కొన్నేళ్లుగా ఫ్లిప్‌ కార్ట్‌, అమెజాన్‌లు ఫారెన్‌ ఇన‍్వెస్ట్‌మెంట్‌ లా నిబంధనల్ని ఉల్లంఘించి మార్కెట్‌ ప్లేస్‌లో వివిధ రకాల బ్రాండ్‌ల అమ్మకాలు జరుపుతున్నట్లు  ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈకామర్స్‌ కంపెనీల వ్యవహారంపై ఈడీ కన్నేసింది. ఇదే సమయంలో ఈడీ.. ఫ్లిప్‌ కార్ట్‌ కు ఫైన్‌ విధించడం చర్చాంశనీయంగా మారింది. 

మార్కెట్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బెంగళూరు కేంద్రంగా ఫ్లిప్‌ కార్ట్‌కు పేటెంట్‌ కంపెనీగా ఉన్న డబ్ల్యూఎస్‌ రీటైల్‌ సర్వీస్‌లో విదేశీ ఇన్వెస్టర‍్లు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించి.. ఆ పెట్టుబడులతో ఫ్లిప్‌కార్ట్‌ తన ఈకామర్స్‌ ప్లాట్ ఫామ్ లో వివిధ రకాల ఉత్పత్తులపై అమ్మకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఆ పెట్టుబడుల గురించి వెలుగులోకి రావడంతో ఈడీ విచారణ చేపట్టి.. గత నెల చెన్నైలోని ఫ్లిప్‌ కార్ట్‌ కార్యాలయానికి సచిన్‌ బన్సాల్‌, బిన్నీ బన‍్సాల్‌ పేరుమీద షోకాజు నోటీసులు జారీ చేసింది.   

కాగా,ఈడీ నోటీసులపై ఫ్లిప్‌కార్ట్‌ ప్రతినిధులు స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి.ఫ్లిప్‌ కార్ట్‌ ఫారెన్‌ ఇన‍్వెస్ట్‌మెంట్‌లా నిబంధనలకు లోబడే కార్యకలాపాలు  నిర‍్వహిస్తోందని, 2009 -2015 సంవత్సర మధ్య జరిపిన లావాదేవీలపై షోకాజు నోటీసులు ఇచ్చినట్లు చెప్పారని సమాచారం.ఇక ఇదే విషయంపై బిన్నీ బన్సాల్‌, సచిన్‌ బన్సాల్‌లు స్పందించకపోవడం ఈడీ నోటీసులకు ఊతం ఇచ్చేలా ఉంది.

మరిన్ని వార్తలు