ఎన్‌ఎస్‌ఈ అక్రమాలు: మాజీ  సీఎండీ రవి నరైన్‌కు ఈడీ షాక్‌ షాక్‌

7 Sep, 2022 11:45 IST|Sakshi

ఎన్‌ఎస్‌ఈ  అవకతవకలు, మాజీ  సీఎండీ  రవి నరైన్ అరెస్ట్‌

న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌ఇ) మాజీ ఛైర్మన్ రవి నరైన్‌ను మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. కో-లొకేషన్ స్కాం కేసులో ఉద్యోగుల అక్రమ ఫోన్ ట్యాపింగ్‌ లాంటి రెండు క్రిమినల్ కేసుల్లో భాగంగానరైన్ పాత్రను ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది.  విచారణలో సహకరించపోవడంతో  అధికారులు ఆయను  అరస్టు చేసినట్టు తెలుస్తోంది. కస్టడీ నిమిత్తం నరేన్‌ను బుధవారం ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు.ఎన్‌ఎస్‌ఈలో జరిగిన అవకతవకలపై ఐదేళ్లుగా విచారణచేస్తున్న సంస్థ నారేన్‌ను అరెస్టు చేయడం ఇదే తొలిసారి. 

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ సంజయ్‌ పాండేతోపాటు, మరో  ఎన్‌ఎస్‌ఈ మాజీ  ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణను అరెస్టు చేసిన నెలల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. కోలొకేషన్ స్కామ్‌లో మనీ లాండరింగ్ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించిన దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తున్న రెండో కేసు ఇది. అయితే ఈ కేసులను సమాంతరంగా విచారిస్తున్న సీబీఐ, కో-లొకేషన్ కేసులో ఆమెను అరెస్ట్ చేసింది. రవి నరైన్‌ 1994 నుంచి 2013 వరకు  ఎన్‌ఎస్‌ఈ సీఎండీ  వ్యహరించారు. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేటగిరిలో 2013, ఏప్రిల్‌ 1 నుంచి 2017, జూన్‌ 1 వరకు వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు.
 

మరిన్ని వార్తలు