నీరవ్‌ ఆస్తులు అటాచ్‌

24 Jul, 2022 04:32 IST|Sakshi

న్యూఢిల్లీ: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి చెందిన రూ.253.62 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. హాంకాంగ్‌ కేంద్రంగా పనిచేస్తున్న నీరవ్‌ కంపెనీలకు చెందిన రత్నాలు, నగలు, బ్యాంక్‌ డిపాజిట్లను జప్తు చేసినట్లు తెలిపింది.

సుమారు రూ.16వేల కోట్ల మేర పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో ప్రస్తుతం యూకేలో జైలు శిక్ష అనుభవిస్తున్న నీరవ్‌ను భారత్‌కు రప్పించే ప్రయత్నాలు తుదిదశలో ఉన్నట్లు పేర్కొంది. తాజా జప్తుతో కలిపి నీరవ్‌కు చెందిన మొత్తం రూ.2,650 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లయిందని వివరించింది.

మరిన్ని వార్తలు