Vivo: చైనా కంపెనీకి భారీ షాక్‌: నగలు, నగదు, బ్యాంక్‌ ఖాతాలు సీజ్‌

7 Jul, 2022 19:28 IST|Sakshi

వివోకు కేంద్రం ఝలక్‌

465 కోట్ల రూపాయలున్న 119 బ్యాంకు ఖాతాలు సీజ్‌

సాక్షి, ముంబై: చైనాకు చెందిన కంపెనీలకు షాకిస్తున్న కేంద్రం తాజాగా వివో మొబైల్స్‌కు భారీ ఝలకిచ్చింది.  మనీలాండరింగ్‌ ఆరోపణలపై భారీ ఎత్తున బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేసింది. దేశవ్యాప్తంగా 48 ప్రదేశాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ భారీగా సోదాలు చేపట్టింది. ఈ సందర్భంగా ఇండియా వ్యాపారానికి సంబంధించిన 119 బ్యాంక్ ఖాతాలను బ్లాక్ చేసినట్టు ఈడీ గురువారం ప్రకటించింది. 

మనీలాండరింగ్‌పై దర్యాప్తులో భాగంగా చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు  వివో మొబైల్స్‌  ప్రైవేట్‌  లిమిటెడ్‌, దాని 23 అనుబంధ కంపెనీల్లో  విస్త్రృత తనిఖీలు చేసింది. ఈ సందర్భంగా 465  కోట్ల రూపాయలను  సీజ్‌ చేసింది. 119 బ్యాంకుల్లో  73 లక్షల  నగదు  సహా, 66 ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, 2 కేజీలల బంగారం బార్స్‌ ఈడీ  స్వాధీనం చేసుకుంది.

వివో  భారతీయ విభాగం దాదాపు 62,476 కోట్ల రూపాయల టర్నోవర్‌లో దాదాపు 50 శాతం "రెమిట్" చేసిందని  ఈడీ  గురువారం వెల్లడించింది. విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నష్టాలను చూపించి పన్నులు చెల్లించకుండా ఎగవేసిందని, ఆ నిధులను  దేశం వెలుపలికి తరలించిందనీ ఆరోపించింది. 2018లో వివో మాజీ డైరెక్టర్ బిన్ లౌ  దేశం విడిచి పారిపోయాడని పేర్కొంది.

మరిన్ని వార్తలు