-

చైనా ‘ఉద్యోగ’ యాప్‌పై ఈడీ చర్యలు

4 Oct, 2022 06:08 IST|Sakshi

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సెలబ్రిటీ వీడియోలను ‘లైక్‌’ చేయడం, ‘అప్‌లోడ్‌’ చేయడం వంటి పలు విభాగాల్లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలను కల్పిస్తామని అనేక మంది యువకులను మోసగించిన చైనీస్‌ ‘నియంత్రిత’ మొబైల్‌ యాప్‌– ‘కీప్‌షేర్‌’పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చర్యలు ప్రారంభించింది. బెంగుళూరు కేంద్రంగా యాప్‌తో కలిసి పనిచేస్తున్న 12 అనుబంధ సంస్థల పై దాడిజరిపి రూ.5.85 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఈడీ పేర్కొంది.

ఈ యాప్‌ నిర్వాహకులు యువత నుంచి అక్రమంగా, మోసపూరితంగా డబ్బు వసూలు చేసినట్లు కూడా ఈడీ ప్రకటన తెలిపింది. ‘‘చైనీయులు ఇక్కడ కంపెనీలను ఏర్పాటు చేసుకున్నారు. అనేక మంది భారతీయులను డైరెక్టర్లుగా, అనువాదకులుగా (మాండరిన్‌ నుండి ఇంగ్లీష్‌– ఇంగ్లీష్‌ నుంచి మాండరిన్, హెచ్‌ఆర్‌ మేనేజర్లు, టెలి కాలర్‌లుగా నియమించుకున్నారు’’ అని ఈడీ తెలిపింది. వాట్సాప్, టెలి గ్రామ్‌ల ద్వారా ఉపాధి కల్పనకు సంబంధించి చైనీయులు విస్తృతంగా ప్రకటనలు చేశారని తెలిపింది. ఇండియన్ల డాక్యుమెంట్లు పొందారని, బ్యాంక్‌ అకౌంట్లను ఓపెన్‌ చేయించారని వివరించింది.

మరిన్ని వార్తలు