చైనా లోన్‌ యాప్స్‌: పేటీఎం, రేజర్‌పే, క్యాష్‌ఫ్రీలకు ఈడీ షాక్‌!

3 Sep, 2022 15:25 IST|Sakshi

బెంగళూరు: ఆన్‌లైన్‌ పేమెంట్‌ సంస్థలు రేజర్‌పే, పేటీఎం, క్యాష్‌ఫ్రీ సంస్థలకు చైనీస్ లోన్ యాప్‌ల అక్రమ దందా  సెగ చుట్టుకుంటోంది. కర్ణాటక రాజధాని నగరంలో ఆరు ప్రాంగణాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో చైనీయుల నియంత్రణలో ఉన్న ఈ సంస్థల ఖాతాల్లోని రూ. 17 కోట్ల విలువైన నిధులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది.

పేటీం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్, రేజర్‌పే, క్యాష్‌ఫ్రీ పేమెంట్స్కు చెందిన బెంగళూరులోని పలు ఆఫీసుల్లో  దాడులు కొనసాగుతున్నాయని ఈడీ శనివారం తెలిపింది. ఇండియాకు చెందిన వారి నకిలీ ఐడీలతో, డమ్మీ డైరెక్టర్లుగా అవతరించి అనుమానిత, చట్టవిరుద్ధమైన ఆదాయాల్ని ఆర్జిస్తున్నారని ఈడీ ఆరోపించింది.  మొబైల్ ద్వారా తక్కువ మొత్తంలో లోన్‌లు ఎరవేసి, ఆ తరువాత  వారిని తీవ్రంగా  వేధించడం లాంటి  వాటికి సంబంధించి  అనేక సంస్థలు/వ్యక్తులపై బెంగళూరు పోలీస్ సైబర్ క్రైమ్ స్టేషన్ దాఖలు చేసిన 18 ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా మనీలాండరింగ్ కేసును రూపొందించినట్లుఈడీ  తెలిపింది.

కాగా పేటీఎం, రేజ‌ర్‌పే స‌హా దేశంలోని ప‌లు పేమెంట్ గేట్‌వే కంపెనీల‌పై ఈడీ ఇప్పటికే నిఘా పెట్టిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన ప‌లు లోన్ల యాప్స్‌ పేమెంట్స్ చేసేందుకు వీటిని వాడుకుంటున్న‌ట్లు ఇంట‌ర్న‌ల్ ఇన్వెస్టిగేష‌న్‌లో ఇటీవలి తేలింది. దీంతో  ఈ ఆయా కంపెనీల‌పై మ‌నీ లాండ‌రింగ్ నిరోధ‌క చ‌ట్టం కింద విచారిస్తోంది. 

మరిన్ని వార్తలు