Edible oil: శుభవార్త, వంటనూనె ధరల్ని తగ్గించిన కేంద్రం..ఎంతంటే

5 Nov, 2021 16:50 IST|Sakshi

వంటనూనె వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దేశంలో వంట నూనెల ధ‌ర‌ల గ‌ణ‌నీయంగా త‌గ్గాయ‌ని కేంద్ర ఆహార ప్ర‌జాపంపిణీ విభాగం తెలిపింది. నూనె రకాన్ని బ‌ట్టి కిలోకు క‌నిష్ఠంగా రూ.7 నుంచి గ‌రిష్ఠంగా రూ.20 వ‌ర‌కు త‌గ్గిన‌ట్లు ఫుడ్ అండ్ ప‌బ్లిక్ డిస్ట్రిబ్యూష‌న్‌ డిపార్టుమెంట్‌ కార్య‌ద‌ర్శి సుధాన్షు పాండే వెల్ల‌డించారు.

పామాయిల్‌,శనగ నూనె, సోయాబీన్ నూనె, పొద్దుతిరుగుడు నూనెతోపాటు అన్ని ప్ర‌ధాన‌మైన నూనె ర‌కాల‌పై ధ‌ర‌లు త‌గ్గిన‌ట్లు తెలిపారు.దేశంలోని ప్రాంతాల్ని బట్టి ధరలు రూ.20, రూ.18,రూ.10,రూ.7లు తగ్గనున్నట్లు మీడియా సమావేశంలో మాట్లాడారు.  

ఇప్పటికే కేంద్రం కీలక నిర్ణయం 
మార్కెట్‎లో మండిపోతున్న వంట నూనెల ధరలపై కేంద్రం అక్టోబర్‌లోనే కీలక నిర్ణయం తీసుకుంది. పన్నులు తగ్గించినా వంట నూనె ధరలు తగ్గకపోవడంతో వినియోదారులపై భారాన్ని తగ్గించేలా వ్యాపారుల వద్ద ఉన్న వంట నూనెలు, నూనె గింజల నిల్వలపై మార్చి 31, 2022 వరకు పరిమితి విధించింది.

ఆహార, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్‌మెంట్ ఈ వస్తువులపై స్టాక్ పరిమితులను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని ఆదేశించింది. తాజాగా ఫుడ్ అండ్ ప‌బ్లిక్ డిస్ట్రిబ్యూష‌న్‌ డిపార్టుమెంట్‌ స్టాక్ పరిమితులను అమల్లోకి తీసుకురావడంతో వంటనూనెలల ధరలు తగ్గాయి.

మరిన్ని వార్తలు