అరె డాల్ఫిన్‌లా ఉందే, వరల్డ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ రికార్డ్‌లను తుడిచి పెట్టింది

22 Nov, 2021 20:28 IST|Sakshi

రోల్స్‌ రాయిస్‌కు చెందిన 'స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్' ఎలక్ట్రిక్‌ ఫ్లైట్‌ ఇప్పటి వరకు అన్నీ రికార్డ్‌లను తుడిచిపెట్టింది. మూడు సరి కొత్త ప్రపంచ రికార్డ్‌లను క్రియేట్‌ చేసి ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్‌ ఎలక్ట్రిక్ ఎయిర్‌ క్రాఫ్ట్‌గా ప్రసిద్ధికెక్కింది.

ఎనర్జీ అండ్‌ ఇండస్ట్రియల్ స్ట్రాటజీ అండ్‌ ఇన్నోవేట్ యూకే భాగస్వామ్యంతో ఏరోస్పేస్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (ATI) సంస్థ నిధుల్ని అందించింది. ఆ నిధులతో రోల్స్‌ రాయిస్‌ 'యాక్సిలరేటింగ్ ది ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ఫ్లైట్' పేరుతో స్పిరిట్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ అనే ఎలక్ట్రిక్‌ ఫ్లైట్‌ను తయారు చేసింది. అయితే తాజాగా యూకే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ బోస్కోంబ్ డౌన్ ఎయిర్‌క్రాఫ్ట్ టెస్టింగ్ నిర్వహించింది.

ఈ టెస్టింగ్‌లో రోల్స్‌ రాయిస్‌ ఎలక్ట్రిక్‌ విమానం 3 కిలోమీటర్లను 555.9 కేఎం/హెచ్‌ (345.4 ఎంపీహెచ్‌ ) అత్యధిక స్పీడ్‌తో అధిగమించింది. దీంతో ఇప్పటికే ఉన్న రికార్డ్‌ను 213.04 కేఎం/హెచ్‌ (132ఎంపీహెచ్‌) బద్దలు కొట్టింది. అంతేకాదు విమానం 532.కేఎం/హెచ్‌ (330 ఎంపీహెచ్‌) స్పీడ్‌తో 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లి ఈ అరుదైన ఫీట్‌ను సాధించగా, ఒకే సమయంలో 3000 కిలోమీటర్ల ఎత్తును ఒకేసారి 60 సెకన్ల నుంచి  202 సెకన్ల సమయంలో అధిగమించింది.

రికార్డ్‌ను క్రియేట్‌ చేసే సమయంలో విమానం 623కేఎం/హెచ్‌ (387.4ఎంపీహెచ్‌) గరిష్ట వేగాన్ని అందుకుంది. తో ఇదే ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌గా నిలిచింది. ఈ రికార్డ్‌లను వరల్డ్‌ ఏరోనాటికల్ అండ్‌ ఆస్ట్రోనాటికల్ రికార్డులను నియంత్రించే, ధృవీకరించే వరల్డ్ ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ - ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ (FAI)రోల్‌ రాయిస్‌ రికార్డ్‌లను ధృవీకరించాయి.

చదవండి: బిఎమ్‌డబ్ల్యు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

మరిన్ని వార్తలు