ఎలక్ట్రిక్ వెహికల్ కొనేవారికి కేంద్రం శుభవార్త!

17 Oct, 2021 21:02 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనేవారిని ప్రోత్సహించడం కోసం కేంద్రం ఇప్పటికే సబ్సిడీ ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు మరో శుభవార్త ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు చెప్పింది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారిని వేదిస్తున్న ప్రధాన సమస్యకు చెక్ పెట్టేందుకు జాతీయ రహదారులపై ప్రతి 40 నుండి 60 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ లక్ష్యంగా పెట్టుకున్నట్లు రోడ్డు కార్యదర్శి గిరిధర్ అరామానే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 2023 నాటికి దేశంలో ఉన్న 40,000 కిలోమీటర్ల జాతీయ రహదారులను ఛార్జింగ్ స్టేషన్లతో కవర్ చేయాలని అథారిటీ యోచిస్తున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్ అరామే తెలిపారు. 

మొత్తం మీద, రాబోయే రెండేళ్లలో 700 ఛార్జింగ్ ఏర్పాటు చేయనున్నారు. " ఇక ఎలక్ట్రిక్ వాహనంలో జాతీయ రహదారులపై వెంట ప్రయాణిస్తున్న వారు ఛార్జింగ్ ఆయిపోతే భాదపడాల్సిన అవసరం లేదు" అని అరామానే తెలిపారు. ఛార్జింగ్ స్టేషన్లు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వేస్, ఇప్పటికే ఉన్న రహదారుల వెంట ప్రైవేట్ సంస్థల ద్వారా అభివృద్ధి చేయనున్నారు. "ఎలక్ట్రిక్ వేహికల్ ఛార్జింగ్ సదుపాయాలను మెరుగుపరచడానికి వేసైడ్ సౌకర్యాల కోసం మేము రాయితీ ఒప్పందాన్ని సవరించాము. అంతేగాకుండా రెస్టారెంట్, మరుగుదొడ్లు, డ్రైవర్ల విశ్రాంతి గదులు, పెట్రోల్ & డీజిల్ పంపిణీ యంత్రాలు ఏర్పాటు చేయనున్నట్లు" అరామానే తెలిపారు. 

ఇప్పటివరకు ఎన్‌హెచ్‌ఏఐ 700 వేసైడ్ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి బిడ్లను ఆహ్వానించింది. ఇందులో ఈవి ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఉన్నాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది, కానీ తగినంత ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల కొనుగోలు దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2017-18లో 69,012 యూనిట్ల రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించినట్లు అప్పటి భారీ పరిశ్రమల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మార్చిలో పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఈ సంఖ్య 2018-19లో 1,43,358 యూనిట్లు, 2019-20లో 1,67,041కు పెరిగాయి. 

(చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలు ఎప్పటికీ అదే రేంజ్ మైలేజ్ ఇస్తాయా?)

మరిన్ని వార్తలు