ఎలక్ట్రిక్ వాహన విప్లవం రాబోతుంది: భవిష్ అగర్వాల్

24 Jun, 2021 15:06 IST|Sakshi

'ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) విప్లవం వస్తోంది!' అని ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ అన్నారు. ఈవీలను తక్కువ ధరకు తీసుకొనిరావడానికి అనేక రాష్ట్రాలు తీసుకున్న చర్యలపై తాజాగా ఆయన వ్యాఖ్యానించారు. "ఈవీ విప్లవం రాబోతుంది!. 2017లో మొట్టమొదటి సారిగా కర్ణాటక తీసుకున్న చర్యల నుంచి గత వారం గుజరాత్ ఈవీ-2021 పాలసీని ఆమోదించిన వరకు మొత్తం 21 రాష్ట్రాలు, యుటీలు ఎలక్ట్రిక్ వాహనలను తక్కువ ధరకు తీసుకొనిరావడానికి ప్రోత్సహిస్తున్నాయి. ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ, త్వరలో రాబోతున్న మా స్కూటర్ ఈవీని మరింత వేగవంతం చేయనుంది" అని అగర్వాల్ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు. 

గుజరాత్ 2021 ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ
గుజరాత్ ప్రభుత్వం గుజరాత్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2021ను ఆమోదించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్య చేశారు. రాబోయే నాలుగు సంవత్సరాలలో రాష్ట్ర రోడ్లపై కనీసం రెండు లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను చూడాలనే లక్ష్యంతో ఈ పాలసీ తీసుకొచ్చినట్లు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పేర్కొన్నారు. ప్రజలను ఈ-వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించడానికి, రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసే కొనుగోలుపై రూ.20,000(టూ-వీలర్) నుంచి రూ.1,50,000(ఫోర్- వీలర్) వరకు సబ్సిడీలను అందిస్తుంది. ఈ కొత్త నిబందనలు నాలుగు సంవత్సరాల పాటు అమల్లో ఉంటాయి. దీని వల్ల ప్రతి సంవత్సరం రూ.5 కోట్ల విలువైన ఇంధనాన్ని ఆదా అవుతుందని సీఎం అన్నారు.

కర్ణాటక ప్రభుత్వం మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి 2017లో తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని గత నెలలో సవరించింది. ఎలక్ట్రిక్ వేహికల్ (ఈవీ) రంగంలోని పెట్టుబడిదారులకు ఈవీ అసెంబ్లీ లేదా తయారీ సంస్థలకు 50 ఎకరాల భూమికి 5 సమాన వార్షిక చెల్లింపుల స్థిర ఆస్తుల విలువపై 15% మూలధన సబ్సిడీని ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం.. మే 27 రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన ప్రకారం, 2017 కర్ణాటక ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజీ విధానాన్ని ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగానికి ప్రోత్సహించడానికి, రాబోయే 5 సంవత్సరాలలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి సవరించినట్లు ఉత్తర్వులలో ఉంది.

చదవండి: అదిరిపోయిన బీఎండబ్ల్యూ ‘మినీ’ కార్లు..!

మరిన్ని వార్తలు