దేశంలో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు

10 Oct, 2021 21:15 IST|Sakshi

వెయ్యి మైళ్ళ ప్రయాణం ఒక చిన్న అడుగుతో ప్రారంభమవుతుంది అనే సామెత మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సామెత గురుంచి ఎందుకు చెబుతున్నాను అంటే.. రెండు, మూడేళ్ళ క్రితం వరకు ఎలక్ట్రిక్ వాహనల గురుంచి మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువ అని చెప్పుకోవాలి. కానీ, ఈ ఏడాదిలో దేశంలో ఈవీ పరిశ్రమ పుంజుకుంది. గతంలో దేశంలో ఒకటితో మొదలు అయిన ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య నేడు లక్షలకు చేరుకుంది. ఈ ఆర్ధిక(ఎఫ్ వై22) మొదటి అర్ధభాగంలో ఈవీ అమ్మకాలు మూడు రెట్లు పెరిగి 1.18 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. 

టాటా మోటార్స్,ఎలక్ట్రిక్ టూ, త్రీ వీలర్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఎలక్ట్రిక్ వాహనలను తీసుకొనిరావడంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అలాగే, చమరు ధరలు పెరగడం కూడా ఎలక్ట్రిక్ వాహన కంపెనీలకు కలిసి వచ్చింది అని చెప్పుకోవాలి. సెప్టెంబర్ వరకు ఎలక్ట్రిక్ టూ వీలర్ అమ్మకాలు 58,264 యూనిట్లుగా ఉంటే, త్రిచక్ర వాహనాలు 59,808 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు 3 రేట్లు పెరిగాయి.

మెరుగైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, చమరు ధరలు పెరగడం, బ్యాటరీ ధరలు పడిపోవడం వల్ల ఈవీ అమ్మకాలు పెరిగాయి. భారతదేశంలో ఇప్పటికే 1.18 లక్షల ఎలక్ట్రిక్ వాహన విక్రయాలు జరిగాయి. ఇది గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం అమ్మకాల్లో 90%. "కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలు కొత్త ఈవీ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. అలాగే పెరుగుతున్న ఇంధన ఖర్చులు పెరగడం ఒక కారణం" అని సెంటర్ ఫర్ ఎనర్జీ ఫైనాన్స్ ప్రోగ్రామ్(సీఈఈఈ) లీడ్ రిషబ్ జైన్ అన్నారు. 

(చదవండి: అప్పుడే 6జీ టెక్నాలజీపై కసరత్తు ప్రారంభించిన కేంద్రం)

మరిన్ని వార్తలు