జోరుగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు

19 Mar, 2021 15:13 IST|Sakshi

ఇండియాలో ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజీల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. అన్ని నగరాల్లోను పెట్రోల్ రూ.90 దాటగా, డీజిల్ ధరలు చాలా చోట్ల రూ.80 దాటాయి. అయితే, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడటం వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నట్లు ప్రభుత్వాలు పేర్కొన్నాయి. సామాన్య ప్రజానీకం దానికి భిన్నంగా చమురుపై విధించిన పన్నులను తగ్గించాలని కోరుతున్నారు. పెరుగుతున్న ధరల కారణంగా సాధారణ ప్రజానీకం ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికిల్స్ వైపు దృష్టి సారిస్తున్నారు. 

పెరుగుతున్న పెట్రోల ధరల భారాన్ని తగ్గించుకునేందుకు వాహన కొనుగోలుదారులు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రికల్ వెహికిల్స్‌ వైపు చూస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను కూడా కేంద్రం ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం ఎలక్ట్రికల్ వెహికిల్స్ అందరికీ అందుబాటులోకి రానప్పటికీ ప్రజలు దాని గురుంచి ఆలోచించడం మొదలుపెట్టారు. ఇటీవలి కాలంలో ప్రధానంగా ఎలక్ట్రికల్ టూ-వీలర్స్, ఎలక్ట్రికల్ గూడ్స్ వెహికిల్ సేల్స్ భారీగా పెరిగాయి. ఓకినావా ఆటోటెక్ స్కూటర్ అమ్మకాలు ఈ ఏడాది 30 శాతం నుంచి 40 శాతానికి పెరిగినట్లు ఒకినావా ఆటోటెక్, ఎండి & వ్యవస్థాపకుడు జీతేందర్ శర్మ పేర్కొన్నారు. గత మూడేళ్ల నుంచి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు పేర్కొన్నారు.

ఎలక్ట్రికల్ వెహికిల్స్ కొనుగోలు చేస్తే ఒక యూనిట్ ఖర్చుతో పదుల కిలోమీటర్లు వెళ్తుంది. ఎలక్ట్రికల్ గూడ్స్ వెహికిల్ ధరలు రూ.1 లక్ష నుంచి ప్రారంభం అవుతున్నాయి. చాలా మంది చిన్న చిన్న వ్యాపారులు కూడా వీటిని కొనుగోలు చేసి వస్తువులు కొనుగోలు, రవాణా కోసం ఉపయోగిస్తున్నారు. వ్యాపారులు అద్దె గూడ్స్ వెహికిల్స్‌లలో వస్తువులు తెచ్చుకునేవారు. ఇప్పుడు చాలామంది సొంతగా ఎలక్ట్రికల్ వెహికిల్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు కొనుగోలు ఖర్చు మాత్రమే ఉండి, ఆ తర్వాత రవాణా ఖర్చు పెద్దగా లేకపోవడమే కారణంగా చెబుతున్నారు.

చదవండి:

2020లోనూ స్టార్టప్‌లలో పెట్టుబడుల జోరు

మరిన్ని వార్తలు