పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల వల్లే కాలుష్యం ఎక్కువ?

4 Nov, 2021 15:51 IST|Sakshi

కాప్-26 స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో నవంబర్ 1 నుంచి 12 వరకు జరుగుతోంది. ఈ వాతావరణ సదస్సులో పర్యావరణ సమస్యలపై ప్రపంచం దృష్టి సారించడంతో రాబోయే కాలంలో కాలుష్యం తగ్గించాలని అన్నీ దేశాలు భావిస్తున్నాయి. ఎక్కువగా పరిశ్రమలు, వాహనాల చేత వాయు కాలుష్యం ఏర్పడుతుంది. పెట్రోల్ వాహనాల వల్ల వెలువడే కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని ఎక్కువ శాతం దేశాలు అభిప్రాయపడుతున్నాయి. 

ఇంధనాన్ని మండించడం వల్ల ప్రత్యక్ష కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాల్లో దాదాపు పావు వంతు రవాణా రంగం బాధ్యత వహిస్తుంది. అందులో ప్యాసింజర్ కార్లు 45% ఉన్నాయి. ఈ సవాలు నుంచి బయటపడేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు ఒక సమాధానంగా కనిపిస్తున్నాయి. అయితే, ఇక్కడే మనం ఒక చిన్న విషయం తెలుసుకోవాల్సి ఉంది. ఒక వాహనం తయారు కావాలంటే 20,000 నుంచి 30,000 విడిభాగలు అవసరం. ఈ విడిభాగల తయారీ కోసం కొన్ని వేల టన్నుల అల్యూమినియం, ఉక్కు ఇతర పదార్థాలు అవసరం. ఈ ముడి పదార్ధాల తయారీ సమయంలో పరిశ్రమల ద్వారా ఎక్కువ వాయు కాలుష్యం ఏర్పడుతుంది.

ఐసీఈతో పోలిస్తే
సంప్రదాయ అంతర్గత కంబస్టివ్ ఇంజిన్(ఐసీఈ)తో పోలిస్తే బ్యాటరీ-ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేటప్పుడు విడుదల చేసే గ్రీన్ హౌస్ వాయువులు అధిక భాగాన్ని కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఈవీ ఉత్పత్తి ఊపందుకోవడంతో బ్యాటరీ ఉత్పత్తి, పరిశోధనలు, అమ్మకాలు పెరుగుతున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల వల్ల గ్రీన్ హౌస్ ఉద్గారాలు 2040 నాటికి 60% కంటే ఎక్కువకు పెరగబోతున్నాయని కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే కంపెనీ తెలిపింది. ఈ సంస్థ "సరఫరా గొలుసులో డీకార్బనైజేషన్ ప్రాముఖ్యతను విస్మరించలేము" అని గ్రీన్ పీస్ ఈ వారం ప్రచురించిన నివేదికలో పేర్కొంది. 

(చదవండి: ఇది ట్రక్కు కాదు నడిచే ఇళ్లు.. అచ్చంగా హీరోల తరహాలో)

ఈ నివేదికలో పేర్కొన్నట్టు మనం ఒకదాని గురుంచి తెలుసుకోవాలి.. మెరుగైన ఈవీ బ్యాటరీలను తయారు చేయడానికి, రేంజ్ ఎక్కువగా రావడానికి సాంకేతిక నిపుణులు భారీ పరిమాణంలో బ్యాటరీలను తయారు చేయాల్సి ఉంటుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల బరువు పెరుగుతుంది. ఇతర భాగాల బరువు + బ్యాటరీ బరువు కలిపితే వాహనం బరువు పెరుగుతుంది. దీంతో మొత్తంగా వాహనం బరువు పెరగడం చేత మళ్లీ రేంజ్ సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంది.

ఈ సమస్యను అరికట్టడం కోసం కార్ల కంపెనీలు తేలికపాటి బరువు ఉండే అల్యూమినియం వినియోగం వైపు దృష్టి పెడుతున్నారు. సాంప్రదాయ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల్లో 45% లోహాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు నివేదికలో పేర్కొంది. అల్యూమినియం డిమాండ్ పెరగడం చేత లోహ కంపెనీలు ఉత్పత్తిని పెంచాయి. ఉత్పత్తి పెరగడంతో వాయు కాలుష్యం అదే స్థాయిలో పెరుగుతుంది. ఈ రకంగా చూస్తే పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల వల్లే ఎక్కువ వాయు కాలుష్యం మరింత తీవ్రమవుతోంది.

(చదవండి: ఐఓసీఎల్ బాటలోనే బీపీసీఎల్.. బంకుల్లో ఛార్జింగ్ స్టేషన్లు!)

ఇంకా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం పవర్ అవసరం అనే విషయం అందరికీ తెలిసిందే. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ వల్ల విద్యుత్ కి డిమాండ్ పెరుగుతుంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రభుత్వాలు, కంపెనీలు థర్మల్ కర్మాగారాల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇక్కడ సౌర విద్యుత్ ఆప్షన్ ఉన్న ప్రస్తుతం మన దేశంతో సహ ఇతర దేశాలలో ఇంకా అంత ఎక్కువగా అందుబాటులోక రాలేదు. అందుకని ఎలక్ట్రిక్ వాహన సంస్థలు, ప్రభుత్వాలు ఈ సమస్యల మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం వచ్చింది.

మరిన్ని వార్తలు