మహిళా స్టార్టప్‌లకు నిధుల సాయం, ఎవరు? ఎలా? 

23 Mar, 2023 19:31 IST|Sakshi

ఎలైట్‌ ఫుడ్స్‌ ప్రకటన 

హైదరాబాద్‌: మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎలైట్‌ ఫుడ్స్‌ అండ్‌ ఇన్నోవేషన్స్‌ గ్రూప్‌ ‘స్కేల్‌ యువర్‌ స్టార్టప్‌’ పేరుతో క్తొత కార్యక్రమాన్ని ప్రారంభించింది. రూ.10 లక్షలకు మించిన ఆదాయం గడించే మహిళల ఆధ్వర్యంలోని స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వనుంది. స్టార్టప్‌లకు ఆర్థిక సాయం, మార్గదర్శకం అందించాలన్నది ఎలైట్‌ గ్రూప్‌ చైర్మన్, ఎండీ టీఆర్‌ రఘులాల్‌ కలల ప్రాజెక్టు అని తెలిపింది. మహిళల ఆధ్వ ర్యంలో నడుస్తూ, వారి వాటా కనీసం 51 శాతం ఉంటే, ఏప్రిల్‌ 10 వరకు ఎలైట్‌కనెక్ట్‌ డాట్‌ ఇన్ఫో వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.  

 (చదవండి: ట్విటర్‌ మాజీ సీఈవోపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన రిపోర్టు)

స్టార్టప్‌ల ఎంపిక ప్రమాణాలు టీం,  మార్కెట్, వ్యాపార నమూనా ,సామాజిక ప్రభావం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.. వివిధ పరిశ్రమల రంగాలకు చెందిన నిపుణుల బృందం ఎంపిక ప్రక్రియను చేపట్టనుంది. "మహిళా పారిశ్రామికవేత్తలు వారి కలలను సాధించడానికి , వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి తోడ్పాటు అందించడం ద్వారా వారికి సాధికారత కల్పించడమే తమ లక్ష్యమన్నారు ఎలైట్ ఫుడ్స్ అండ్ ఇన్నోవేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దానేసా రఘులాల్ . (యాక్సెంచర్‌ సంచలనం: ఏకంగా 19వేల మందికి ఉద్వాసన)

ఇదీ చదవండి: ‘నాటు నాటు’ ఫీవర్‌: నా వల్ల కావడం లేదు..ఇదే లాస్ట్! ఆనంద్‌ మహీంద్ర

>
మరిన్ని వార్తలు