ఎల్లీసియం మేడిన్‌ ఇండియా ‘ఈవీయం ఈ-స్కూటర్లు’ త్వరలోనే

22 Jun, 2022 14:57 IST|Sakshi

సాక్షి, ముంబై: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ ఆధారిత మెటా4కి  చెందిన ఆటో విభాగం ఎల్లీసియం ఆటోమోటివ్స్‌ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను త్వరలోనే లాంచ్‌ చేయనున్నట్టు బుధవారం ప్రకటించింది. ‘ఈవీయం’ అనే బ్రాండ్‌ పేరుతో  మూడు  మేడ్‌ ఇన్‌ ఇండియా ఈ-స్కూటర్లను తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. 

250  ఏకరాల్లో తెలంగాణలోని జహీరాబాద్‌లోని నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్‌లోనే వీటిని తయారు చేస్తున్నట్టు సంస్థ తెలిపింది. భారత ప్రభుత్వ పంచామృత  విజన్‌తో ఇ-మొబిలిటీ మిషన్లో ఎల్లీసియం ఆటోమోటివ్స్ 100 శాతం భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ వెంచర్‌ను లాంచ్‌ చేశామని వెల్లడించింది. 

అలాగే EVeium సొంత టెలిమాటిక్స్ యాప్‌ అందజేస్తుందని, ఇది డీజీ-లాకర్, సమీప ఛార్జింగ్ స్టేషన్ లొకేషన్, జియో-ఫెన్సింగ్ లాంటి ఫీచర్లను అందిస్తుందని పేర్కొంది. గ్లోబల్ ఇంధన ధరల సంక్షోభం, పర్యావరణ పరిరక్షణ అవగాహనతో దేశీయ మార్కెట్‌లో మూడు ఈ-స్కూటర్లను పరిచయం చేస్తున్నామని సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌  వైస్ ప్రెసిడెంట్‌ ఆదిత్య రెడ్డి తెలిపారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు, సైకిళ్లు, ఎలక్ట్రిక్ బైక్‌లతో సహా అత్యుత్తమ EV ఆఫర్‌లను అందించడానికి పని చేస్తుందన్నారు. 

భారత ప్రహుత్వ ఫేమ్-II  నిబంధనలకనుగుణంగా భారతీయ వినియోగదారుల కోసం సరసమైన ధర, నాణ్యతతో ఈవీలను తీసుకురావాలని భావిస్తున్నట్టు META4 గ్రూప్ సీఈవో ముజమ్మిల్ రియాజ్ అన్నారు. తెలంగాణలో ఈ-వెహికల్స్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా స్మార్ట్ గ్రీన్ మొబిలిటీలోవోల్ట్లీ ఎనర్జీ ద్వారా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. 15ఎకరాల సబ్సిడీ భూమిని అందిస్తున్న ఈ ప్లాంట్‌ కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ  కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు