యాడ్స్‌పై ఒక్క రూపాయి పెట్టలేదు.. కానీ కంపెనీ విలువ రూ.76.21 లక్షల కోట్లు

21 Apr, 2022 11:06 IST|Sakshi

పబ్లిసిటీపై ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వివాస్పద వ్యాఖ్యలు చేస్తూ సినిమాకు పబ్లిసిటీ తీసుకురావడంలో రామ్‌గోపాల్‌ వర్మది అందవేసిన చేయి. అలాంటి ఆర్జీవీకే బాప్‌లా ఉన్నాడు ఎలన్‌ మస్క్‌. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్న ఎలన్‌మస్క్‌ విజయ ప్రస్థానంలో టెస్లా కార్లది కీలక పాత్ర. మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కార్ల బ్రాండ్‌గా టెస్లా కొనసాగుతోంది. 

టెస్లా కార్ల పబ్లిసిటీ కోసం ఎలన్‌ మస్క్‌ ఎటువంటి ప్రచారం చేయలేదు. ఎక్కడా కూడా ఒక సెంటు డాలరు ఖర్చు పెట్టి అడ్వెర్‌టైజ్‌మెంట్లు ఇచ్చింది లేదు. కానీ టెస్లా కార్ల నాణ్యత. ఎలన్‌ మస్క్‌ వ్యూహచతురతతో టెస్లా కంపెనీ మార్కెట్‌ క్యాపిటల్‌ విలువ ఒక ట్రిలియన్‌ డాలర్లకు (రూ. 76.21 లక్షల కోట్లు) చేరుకుంది. ఈ విషయాన్ని ఎలన్‌మస్క్‌ ఇటీవల ఓ మార్కెట్‌ నిపుణుడి ట్వీట్‌కి స్పందిస్తూ స్వయంగా తెలిపారు.

‍గ్యారీబ్లాక్‌ అనే మార్కెట్‌ నిపుణుడు టెస్లా వ్యవహరాలను నిశితంగా పరిశీలిస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో టెస్లా కార్ల సేల్స్‌, మార్కెట్‌ వాల్యు ఎలా పెరిగిందో తెలుపుతూ ఓ ట్వీట్‌ చేశారు. ఈవీ సెక్టార్‌లో ఇతర కంపెనీలు అడ్వైర్‌టైజ్‌మెంట్లు ఇస్తుంటే అమ్మకాలు టెస్లాలో పెరుగుతున్నాయంటూ ఓ చార్ట్‌ను పోస్ట్‌ చేశారు. దీనికి ఎలన్‌ మస్క్‌ స్పందిస్తూ యాడ్స్‌ కోసం రూపాయి ఖర్చు చేయకుండా టెస్లా కంపెనీ మార్కెట్‌ విలువ వన్‌ ట్రిలియన్‌ డాలర్లకు చేరిందంటూ తెలిపాడు. 

చదవండి: Elon Musk: నేను ట్విటర్‌ సొంతం చేసుకుంటే వాళ్లకు జీతం ఉండదు!

>
మరిన్ని వార్తలు