మేం చేస్తాం..మేం చేస్తాం, ఎలన్‌ మస్క్‌ ఎంట్రీ..ట్విటర్‌ కు పెరిగిన క్రేజ్‌!

8 May, 2022 15:41 IST|Sakshi

ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ సీఈఓగా బాధ్యతలు చేపడితే ఆ సంస్థ స్వరూపమే మారిపోనున్నట్లు తెలుస్తోంది. అందుకు ఊతం ఇచ్చేలా ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. 44 బిలియన‍్లతో ఎలన్‌మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ కొనుగోలు తర‍్వాత గతంలో కంటే ఇప్పుడే..ఆ సంస్థలో పనిచేసేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. 

తాజా నివేదికల ప్రకారం.. ఆయా సంస్థలు, అందులో పనిచేస‍్తున్న ఉద్యోగుల పనితీరుపై అమెరికాకు చెందిన గ్లాస్‌డోర్‌ అనే సంస్థ అభిప్రాయాల్ని సేకరిస్తుంది. మస్క్‌ ట్విట్టర్‌ను కొనుగోలు తర్వాత జరిపిన రీసెర్చ్‌లో 250శాతంతో ఉద్యోగులు ట్విటర్‌లో పనిచేసేందుకు ఇంటస్ట్ర్‌ చూపిస్తున్నట్లు తేలింది. 

ఫార్చ్యూన్‌ సీనియర్‌ ఎకనామిస్ట్‌ డానియల్‌ జోవో ఈ ఏడాది మార్చి బేస్‌లైన్‌తో పోల్చితే గ్లాస్‌డోర్‌లో ట్విట్టర్ ఉద్యోగాలపై ఆసక్తి గత వారం 263 శాతం పెరిగిందని ట్విట్‌ చేశారు. ఈ సందర్భంగా జోవో..మస్క్‌ గురించి ప్రస్తావిస్తూ..ట్విటర్‌ బాస్‌ కంటే..సీఈఓగా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

చదవండి👉ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ కొనుగోలు..సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ భార్య అదిరిపోయే ట్విస్ట్!

మరిన్ని వార్తలు