నంబర్‌ వన్‌ కుబేరుడిగా మళ్లీ ఎలాన్‌ మస్క్‌

20 Feb, 2021 05:15 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మరోసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. దీంతో అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ మళ్లీ రెండోస్థానానికి పరిమితమయ్యారు. మస్క్‌కి చెందిన రాకెట్ల తయారీ సంస్థ స్పేస్‌ఎక్స్‌ తాజాగా సెకోయా క్యాపిటల్‌ తదితర ఇన్వెస్టర్ల నుంచి 850 మిలియన్‌ డాలర్ల నిధులు సమీకరించింది. కంపెనీ విలువ 74 బిలియన్‌ డాలర్లుగా లెక్కగట్టి ఇన్వెస్టర్లు మదుపు చేశారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం మస్క్‌ సంపద నికర విలువ 11 బిలియన్‌ డాలర్లు ఎగిసి.. 199.9 బిలియన్‌ డాలర్లకు చేరింది. తద్వారా ఆయన నంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకున్నారు. బెజోస్‌ సంపద 194.2 బిలియన్‌ డాలర్లుగా ఉంది. టెస్లా షేర్లు పడిపోవడంతో ఈమధ్యే స్వల్పకాలం పాటు బెజోస్‌ టాప్‌ బిలియనీర్‌గా నిల్చారు.

మరిన్ని వార్తలు