టెస్లా సైబర్‌ రోడియే విశేషాలు ఇవే

26 Mar, 2022 15:16 IST|Sakshi

టెస్లా కంపెనీ అధినేత ఎలన్‌ మస్క్‌ గతంలో ప్రకటించినట్టుగానే సైబర్‌ రోడియే నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు టెస్లా కస్టమర్ల, ఇన్వెస్టర్లు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు సైబర్‌ రోడియోకి సంబంధించిన ఇన్విటేషన్లు పంపారు. 2022 ఏప్రిల్‌ 7న అస్టిన్‌లో ఈ సైబర్‌ రోడియో ఈవెంట్‌ జరగనుంది.

టెక్సాస్‌ అంటేనే కౌబాయ్‌ కల్చర్‌కి పెట్టింది పేరు. సాధారణంగా ఇక్కడ నిర్వహించే రోడియో షోలో కౌబాయ్‌, కౌగర్ల్‌ గెటప్‌లో గుర్రాలపై వచ్చిన యువతి యువకులు తమ నైపుణ్యాలు ప్రదర్శిస్తారు. కాగా టెస్లా నిర​‍్వహిస్తోన్న సైబర్‌ రోడియోలో టెస్లా కస్టమర్లు తమ ఈవీలలో ఈ కార్యక్రమానికి హాజరవుతారు. టెక్సాస్‌లో ఉన్న గిగా ఫ్యాక్టరీలో కార్ల తయారీని స్వయంగా పరిశీలించే వీలు ఉంటుంది. సైబర్‌ రోడియో డేట్లు ప్రకటించడం పట్ల టెస్లా యూజర్లు ఖుషీగా ఫీలవుతున్నారు.

చదవండిట్విట్టర్‌కే ‘శీల’ పరీక్ష పెట్టిన ఎలన్‌మస్క్‌

మరిన్ని వార్తలు