క్షమాపణలతో ముగిసిన ఎలాన్ మస్క్ ట్విటర్ చాట్.. ఏమైందంటే?

9 Mar, 2023 08:00 IST|Sakshi

ట్విట్టర్‌ బాస్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీసుకునే నిర్ణయాలతో, ప్రకటనలతో ప్రతి రోజు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ట్విటర్‌ను కొనుగోలు చేసిన తరువాత తనదైన నిర్ణయాలతో ఉద్యోగులతో పాటు యూజర్లకు కూడా గట్టి షాకులు ఇస్తున్నాడు. ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉంటూ ప్రతి అంశంపై మాట్లాడేందుకు ముందుకు వస్తుంటారు. ఇటీవల ఉద్యోగితో చేసిన చాట్ ప్రస్తుతం చర్చినీయాంశమైంది.

గత కొన్ని రోజులకు ముందు ట్విటర్‌ నుంచి హరాల్దుర్ థోర్లిప్సన్ అనే వ్యక్తి జాబ్ కోల్పోయాడు. తాను జాబ్ కోల్పోవడానికి కారణం తెలియదని వాపోయాడు. తన వర్క్ కంప్యూటర్ యాక్సెస్ తొలగించారని, తొమ్మిది రోజులైనా ఉద్యోగం ఉందా? పోయిందా? అనే విషయంపై క్లారిటీ లేదని మస్క్‌ని ప్రశ్నించారు. ఈ విధంగా చాటింగ్ మొదలైంది.

హరాల్దుర్ థోర్లిప్సన్ కండరాల బలహీనతతో బాధపడుతున్నట్లు, ఈ కారణంగా సొంత పనులు చేసుకోవడానికి కూడా మరొకరి సహాయం తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న క్రమంలో ఉద్యోగం నుంచి తొలగించారని తన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఎలాన్ మస్క్ రిప్లై ఇస్తూ కంపెనీకి థోర్లీప్సన్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కటువుగా మాట్లాడారు.

ఎలాన్ మస్క్ రిప్లైకి హరాల్దుర్ స్పందిస్తూ.. శారీరక లోపం వల్ల నేను కదల్లేకపోతున్నాను, కానీ మస్క్ దృఢంగా ఉన్నప్పటికీ సెక్యూరిటీ సాయం లేకుండా వాష్‌రూంకి సైతం వెళ్లడని వ్యాఖ్యానించాడు. థోర్లీప్సన్ పరిస్థితి తెలియకుండా మాట్లాడానని, తాను చేసిన వ్యాఖ్యలకు మస్క్ క్షమాపణలు కోరుతూ ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తలు