ఫోర్బ్స్‌ లిస్ట్‌లో మస్క్‌ మళ్లీ టాప్‌కి.. 200 బిలియన్‌ డాలర్లు దాటిన సంపద

28 Sep, 2021 10:17 IST|Sakshi

అపర కుబేరుల రేసు ఆసక్తికరమైన మలుపు తిరిగింది. బిజినెస్‌ టైకూన్‌ ఎలన్‌ మస్క్‌  రెండో స్థానం నుంచి మళ్లీ మొదటి ప్లేస్‌కు వచ్చేశాడు. వారం క్రితం  ఫోర్బ్స్‌ విడుదల చేసిన బిలియనీర్ల జాబితాలో మస్క్‌ రెండో ప్లేస్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే టెస్లా స్టాక్‌ ధరలు ఒక్కసారిగా పెరగడంతో మస్క్‌ ఒక్కసారిగా  టాప్‌ పొజిషన్‌లో దూసుకొచ్చాడు.   

ఈ ఏడాది ఫిబ్రవరిలో హయ్యెస్ట్‌ పాయింట్‌కు రీచ్‌ అయిన టెస్లా షేర్ల ధరలు.. ఇప్పుడు మళ్లీ పుంజుకున్నాయి. సోమవారం 2.2 శాతం పెరుగుదలతో 791.36 డాలర్ల వద్ద మార్కెట్‌ ముగిసింది. దీంతో సోమవారం నాటికల్లా మస్క్‌ సంపాదనను లెక్కలోకి తీసుకున్న తర్వాత టాప్‌ బిలియనీర్‌గా నిర్ధారించారు. సంపద విలువ 3.8 బిలియన్‌ డాలర్ల పెరగుదల కారణంగా.. మస్క్‌ మొత్తం సంపద విలువ 203.4 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. దీంతో జెఫ్‌ బెజోస్‌ను దాటేసి మొదటి స్థానానికి చేరాడు ఎలన్‌ మస్క్‌.

తాజా గణంకాల ప్రకారం..  ప్రపంచ అపర కుబేరుల జాబితాలో ఎలన్‌ మస్క్‌ మొదటిస్థానం, బెజోస్‌ రెండు, బెర్నార్డ్ ఆర్నాల్ట్ మూడు, బిల్‌గేట్స్‌ నాలుగు, మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. ప్రధానంగా అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాల ద్వారా బెజోస్‌, మస్క్‌ల మధ్య వైరం నడుస్తున్న సంగతి తెలిసిందే. 


చదవండి: మీకు భూమ్మీది సమస్యలు కనడడం లేదా?.. బిల్‌గేట్స్ ఫైర్‌

ఇదిలా ఉంటే గత కొంతకాలంగా అమెజాన్‌ షేర్లు మార్కెట్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. దీనికితోడు తాజాగా అమెజాన్‌ స్టాక్‌ 0.6 శాతం పడిపోవడంతో బెజోస్‌ సంపద విలువ 197.7 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విశేషం ఏంటంటే.. ఈ ఏడాది జనవరిలో టెస్లా వ్యాపారం తారాస్థాయిలో జరిగింది. అయినప్పటికీ అప్పటికంటే ఇప్పుడే మస్క్‌ సంపద బాగా పెరగడం.

 

టెస్లా విలువ 792 బిలియన్‌ డాలర్లుకాగా, స్పేస్‌ ఎక్స్‌ 74 బిలియన్‌ డాలర్లు ఉంది. ఈ ఏప్రిల్‌లో ఈక్విటీ ఫండింగ్‌ ద్వారా 1.16 బిలియన్‌ డాలర్లు సేకరించగలిగింది. ఇదిలా ఉంటే ఒక్క 2020లోనే మస్క్‌ సంపాదన 720 శాతం పెరిగి.. 125 బిలియన్‌ డాలర్లను తెచ్చిపెట్టింది.   


200 బిలియన్‌ డాలర్ల సంపదను టచ్‌ చేసిన మూడో బిలియనీర్‌. 

ఇంతకు ముందు ఈ రికార్డు జెఫ్‌ బెజోజ్‌, బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ ఈ ఫీట్‌ దక్కించుకున్నారు.

 

అమెజాన్‌ ఓనర్‌ బెజోస్‌ కిందటి ఏడాది ఆగస్టులో ఈ ఫీట్‌ సాధించగా.. ఫ్రాన్స్‌కు చెందిన ఫ్యాషన్‌&రిటైల్‌ ఎల్‌వీఎమ్‌హెచ్‌ కంపెనీ ఓనర్‌​ బెర్నార్డ్ ఆర్నాల్డ్‌ కిందటి నెలలోనే ఈ ఘనత దక్కించుకున్నాడు.

ఇదే ఊపుగనుక కొనసాగితే 2025 నాటికి తొలి ట్రిలియనీర్‌(300 బిలియన్‌ డాలర్లు) ఘనతను మస్క్ సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
 

చదవండి: ఫోర్బ్స్‌ లిస్ట్‌లో ముకేష్‌ అంబానీ.. విలువెంతో తెలుసా?

మరిన్ని వార్తలు