Elon Musk: ట్విట్టర్‌ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌కు ఎలాన్‌ మస్క్‌ బహిరంగ సవాల్‌!

7 Aug, 2022 13:34 IST|Sakshi

స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌..ట్విట్టర్‌ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌కు సవాల్‌ విసిరారు. ఫేక్‌ అకౌంట్‌ల విషయంలో ట్విట్టర్‌ బహిరంగ చర్చకు రావాలని పిలుపు నిచ్చారు. నిరూపణలో మీరు సఫలమైతే.. ట్విట్టర్‌ కొనుగోలు చేసే ప్రాసెస్‌ను ముందుకు కొనసాగుతుందంటూ మస్క్‌ అవకాశం ఇచ్చారు 

ఫేక్‌ అకౌంట్‌ల విషయంలో ఎలాన్‌ మస్క్‌ దాఖలు చేసిన కౌంటర్‌ సూట్‌పై ట్విట్టర్‌ సైబర్‌ సెక్యూరిటీ రెసెర్చర్‌ ఆండ్రియా స్ట్రోపా ట్వీట్‌ చేశారు.ఆ ట్వీట్‌కు ఎలాన్‌ మస్క్‌ ధీటుగా స్పందించారు. తాను పెట్టే ప్రపోజల్‌కు ట్విట్టర్‌ అంగీకరిస్తే..44 బిలియన్‌ డాలర్ల డీల్‌కు సిద్ధమేనని రిప్లయ్‌ ఇచ్చారు. 

100 ట్విట్టర్‌ అకౌంట్‌లు ఒరిజినల్ అని ఎలా ధృవీకరిస్తారో బహిరంగంగా చెప్పాలి. సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్ఛేంజ్‌ ఫైలింగ్‌ (ఎస్‌ఈసీ)లో నిరూపించాలి.అలా చెబితే నిబంధనల ప్రకారం ఒప్పందం ముందుకు సాగుతుంది.

పరాగ్‌ అగర్వాల్‌ ట్విట్టర్‌ అకౌంట్‌కు ట్యాగ్‌ చేస్తూ..పరాగ్‌ ట్విట్టర్‌ బోట్‌ పర్సెంటేజ్‌ తేల్చేందుకు బహిరంగ సవాల్‌కు సిద్ధమా. ట్విట్టర్‌ రోజూవారీ యూజర్లలలో 5శాతం మాత్రమే ఫేక్‌ అకౌంట్‌లు ఉన్నాయని మీరు నిరూపిస్తారా అని ట్వీట్‌ చేశారు. దీనిపై ఓ పోల్‌ కూడా పెట్టారు. ప్రస్తుతం ఎలాన్‌ మస్క్‌ సవాల్‌ ఆసక్తికరంగా మారింది. ఈ సవాల్‌ను పరాగ్‌ అగర్వాల్‌ స్వీకరిస్తారా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సి ఉంది.

చదవండి👉ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ కొనుగోలు..సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ భార్య అదిరిపోయే ట్విస్ట్!

మరిన్ని వార్తలు