ట్విటర్‌ కొనుగోలు వెనుక ట్రంప్‌ హస్తం? అది నిజం కాదు - ఈలాన్‌ మస్క్‌

6 May, 2022 21:00 IST|Sakshi

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు ఈలాన్‌ మస్క్‌. ట్రంప్‌ ప్రోద్బలం వల్లనే నేను ట్విటర్‌ని కొనుగోలు చేసినట్టు వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. అదొక నిరాధారమైన ప్రచారం అని కొట్టిపారేశారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ట్రంప్‌తో తనకు సంబంధాలు లేవని ట్వీట్‌ చేశారు ఈలాన్‌ మస్క్‌. ట్రంప్‌ తన సొంత సోషల్‌ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ అయిన ట్రూత్‌ సోషల్‌ని చూసుకుంటున్నాడని వెల్లడించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా రెచ​‍్చగొట్టే ప్రసంగాలు చేశాడనే నెపంతో ట్విటర్‌ డొనాల్డ్‌ ట్రంప్‌పై జీవితకాల నిషేధం విధించింది. దీంతో ట్రూత్‌ సోషల్‌ పేరుతో సరికొత్త యాప్‌ను డొనాల్డ్‌ ‍ట్రంప్‌ తెచ్చారు. అంతేకాకుండా ట్విటర్‌ మీద పగతోనే ఈలాన్‌ మస్క్‌ను ప్రేరేపించి దాన్ని సొంతం చేసుకునేలా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రేరేపించారంటూ అమెరికా మీడియాలో గత 24 గంటలుగా ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో వెంటనే దీన్ని ఖండిస్తూ ట్వీట్‌ చేశాడు ఈలాన్‌ మస్క్‌

చదవండి: ట్విటర్‌ను హ్యాండిల్‌ చేయడం టెస్లా అంత ఈజీ కాదు - బిల్‌గేట్స్‌

మరిన్ని వార్తలు