‘నాతో గేమ్స్‌ ఆడొద్దు’..!, ట్విటర్‌ ఉద్యోగులకు ఎలాన్‌ మస్క్‌ వార్నింగ్‌!

11 Dec, 2022 12:52 IST|Sakshi

ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ను కోర్టుకీడ్చేందుకు ఆ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో మస్క్‌ ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేశారు. సంస్థకు సంబంధించిన రహస్యాల్ని బయట వ్యక్తులు, మీడియా సంస్థలతో షేర్‌ చేయొద్దని తెలిపారు. సమాచారం అందిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇక అల్టిమేటంను అర్ధం చేసుకున్నామని సూచించేలా ఉద్యోగులు సంతకం చేయాలని మస్క్‌ డిమాండ్ చేశారు

టెక్‌ సంస్థల్లో జరిగే విషయాల్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇచ్చే ‘ప్లాట్‌ప్లామర్‌’ తాజాగా నివేదిక విడుదల చేసింది. పింక్‌ స్లిప్‌లు అందుకున్న 7500 ట్విటర్‌ ఉద్యోగుల్లో కొంత మంది మస్క్‌ను కోర్టుకుకీడ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిబంధనలు విరుద్ధంగా తమను సంస్థ నుంచి ఫైర్‌ చేశారంటూ మాజీ ఉద్యోగులు శాన్‌ ఫ్రాన్సిస్కో కోర్టును ఆశ్రయించారు. వాళ్లు ఎంతమంది ఉన్నారనేది స్పష్టత లేదు. 

ఈ తరుణంలో మాజీ ఉద్యోగులకు తీరుతో మస్క్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సంస్థ రహస్యాలు, మాజీ ఉద్యోగుల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్న నిర్ణయాలతో పాటు ఇతర విషయాలు చాలా సీక్రెట్‌గా ఉంచాలంటూ ఉద్యోగులకు ట్విటర్‌ బాస్‌ ఆదేశించినట్లు ప్లాట్‌ఫామర్‌ తెలిపింది. 

ట్విటర్‌లో చేరే సమయంలో ఎన్‌డీఏ (non-disclosure agreement) అగ్రిమెంట్‌ ఒప్పందం ప్రకారం ఉద్యోగులు ప్రవర్తించాలి. అలా కాకుండా అగ్రిమెంట్‌ అతిక్రమిస్తే సంస్థకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాదు, తన ఆదేశాలను అర్థం చేసుకున్న ఉద్యోగులకు సంబంధిత ప్రతిజ్ఞపై సంతకం చేయాలని ఉద్యోగుల్ని కోరాడని, స్పందించడానికి శనివారం సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారని పేర్కొంది.

చదవండి👉 వైరల్‌: ‘ట్విటర్‌లో మా ఉద్యోగాలు ఊడాయ్‌’..లైవ్‌లో చూపించిన ఉద్యోగులు

మరిన్ని వార్తలు