-

ElonMusk మరో బాంబు: వన్‌ అండ్‌ ఓన్లీ ఆప్షన్‌, డెడ్‌లైన్‌

17 Nov, 2022 17:13 IST|Sakshi

న్యూఢిల్లీ: ట్విటర్‌  టేకోవర్‌ తరువాత బిలియనీర్‌, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ ఉద్యోగులకు  చుక్కలు చూపిస్తున్నారు.  ట్విటర్‌ డీల్‌ పూర్తి చేసిన వెంటనే కీలక ఉద్యోగులపై వేటు, వారం రోజుల్లో సంస్థలో సగం మందిని ఇంటికి పంపించిన మస్క్‌ మిగిలిన ఉద్యోగులకు కూడా కఠిన షరతులు పెడుతున్నారు. చాలా తీవ్రంగా పని చేస్తారా లేక నిష్క్రమిస్తారా తేల్చుకోవాలంటూ ఉద్యోగులకు డెడ్‌లైన్‌​ విధించారు.  ఈ మేరకు  ఉద్యోగులకు ఈ మెయిల్‌ సమాచారం అందించింది ట్విటర్‌. 

కంపెనీతో కలిసి ఉండటానికి ప్రతిజ్ఞ చేయాలని, ట్విటర్‌ సంస్థాగతపునర్నిర్మాణంలో భాగంగా తీవ్ర ఒత్తిడితో, ఎక్కువ గంటలు పని చేయాలని  లేదా వైదొలగేందుకు అంగీకరించాలని  ఈ మెయిల్‌ సందేశాన్ని ఉద్యోగులకు అందించింది. న్యూయార్క్ కాలమానం ప్రకారం నవంబర్ 17వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్ ఫారమ్‌ను పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఉద్యోగులు పూర్తి చేయాలని మస్క్ కోరుకున్న ఫారమ్‌లో ఒకే ప్రశ్న ఉంది: "మీరు ట్విట్టర్‌లో ఉండాలనుకుంటున్నారా?" అలాగే ఆన్‌లైన్‌ ఫాంని సమర్పించేందుకు .. నో అనే అప్షన్‌ లేనేలేదు. కేవలం  ఎస్‌  అనే ఆప్షన్‌ మాత్రమే ఇచ్చింది.  దీనికి అంగీకరించని వాళ్లు మూడు నెలల సెవరెన్స్‌ పే  అందుకుంటారని ఇమెయిల్ పేర్కొంది. అంతేకాదు అసాధారణ పనితీరు ఆధారంగానే గ్రేడ్‌ ఉంటుందని ట్విటర్‌ తెగేసి చెప్పింది.  (మస్క్‌ 13 కిలోల వెయిట్‌ లాస్‌ జర్నీ: ఫాస్టింగ్‌ యాప్‌పై ప్రశంసలు)

సంస్థ  ఆదాయం 50 శాతం పెంచేలా ఉద్యోగులు కష్టపడాల్సిందేనంటూ తన తొలి ఈమెయిల్‌లో మస్క్‌ ఆదేశాలు జారీ చేశారనీ, అలాగే సంస్థ సక్సెస్‌ కోసం చాలా హార్డ్‌కోర్‌గా ఉండాలని ఆదేశించిన ఈమెయిల్‌ సందేశాన్ని ఉటంకిస్తూ, వాషింగ్టన్ పోస్ట్, బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్‌ చేశాయి. దీనిపై పలువురు ఉద్యోగులు సలహా కోసం న్యాయవాదులను సంప్రదిస్తుండగా, తాజా పరిణామంపై ఉద్యోగ, పౌరహక్కుల సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు