మస్క్‌ ఏం చేసినా మామూలుగా ఉండదు.. ఆఫీస్‌కి రానక్కరలేదని అర్ధరాత్రి మెయిల్స్‌!

27 Mar, 2023 12:46 IST|Sakshi

ట్విటర్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ ఏం పని చేసినా మామూలుగా ఉండదు. లేఆఫ్స్‌ దగ్గర నుంచి బ్లూ టిక్స్‌ వరకూ ప్రతీదీ వివాదాస్పదం, చర్చనీయాంశం అవుతోంది. తాజాగా ఆయన ట్విటర్‌ ఉద్యోగులకు అర్ధరాత్రి ఈమెయిల్ పంపడం చర్చనీయాంశం అయింది.

ఇదీ చదవండి: Job search: ఇది మామూలు దండయాత్ర కాదు! 150కిపైగా  కంపెనీలకు అప్లై చేశాడు..  మొత్తానికి...

మస్క్‌ ఇలా ఉద్యోగులకు అర్ధరాత్రి మెయిళ్లు పంపడం కొత్తేమీ కాదు. కంపెనీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఆయన ఉద్యోగులతో పంచుకుంటారు. అయితే ఉద్యోగులు ఆఫీస్‌కి రావాల్సిన అవసరం లేదంటూ అర్ధరాత్రి ఈమెయిల్‌ పంపడమే అసాధారణంగా ఉంది.

ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్! 

ఇంతకీ ఏం జరిగిందంటే.. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ట్విటర్‌ కార్యాలయం ఉద్యోగులు లేక దాదాపు సగం ఖాళీగా ఉండటాన్ని గమనించిన మస్క్ ఆ మరుసటి రోజు నుంచి ఉద్యోగులు ఆఫీస్‌ రావటం వారి ఇష్టమని, తప్పనిసరేమీ కాదని ఉద్యోగులకు అర్ధరాత్రి 2:30 సమయంలో ఈమెయిల్స్‌ పంపారు. ఈ మేరకు Fortune.com నివేదించింది.

మస్క్ ట్విటర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కంపెనీలో అనేక మార్పులు చేశారు. 7,500 ఉన్న ఉద్యోగుల సంఖ్యను ఒకేసారి 2,000లకు తగ్గించారు. కొత్తగా వెరిఫైడ్‌ అకౌంట్లకు సబ్‌క్రిప్షన్‌ చార్జీలు ప్రవేశపెట్టారు.

ఇదీ చదవండి: పీఎఫ్‌ను ముందస్తుగా వెనక్కి తీసుకోవచ్చా?

మరిన్ని వార్తలు