తప్పుడు ట్వీట్‌.. మస్క్‌ చుట్టూ మరో ఉచ్చు

14 Jan, 2023 16:43 IST|Sakshi

న్యూఢిల్లీ: ట్విటర్‌ కొనుగోలు తరువాత  ఆర్థికంగా చిక్కుల్లోపడిన ఎలాన్‌ మస్క్‌ మెడకు  మరో  వివాదం చుట్టుకుంది. స్టాక్‌మార్కెట్‌ను మానుప్యులేట్‌ చేసేలా  ట్వీట్‌ చేశారన్న ఆరోపణలపై విచారణను ఎదుర్కోబోతున్నారు.  2018లో చేసిన ట్వీట్‌కు సంబంధించి ఫెడరల్‌ కోర్టు మంగళవారం విచారించ నుంది.  జ్యూరీ ఎంపిక ఈరోజు ప్రారంభం కానుండగా, ఈ కేసును కాలిఫోర్నియా నుండి తరలించాలన్న మస్క్‌ పిటీషన్‌ను ఫెడరల్ న్యాయమూర్తి  తిరస్కరించారు.

ఆగస్ట్ 7, 2018 ట్వీట్ ద్వారా టెస్లా కొనుగోలు కోసం ఫైనాన్సింగ్‌ను సమీకరించినట్లు, షేరు 420 డాలర్ల చొప్పున తన దగ్గర సరిపడిన నిధులున్నాయని  పేర్కొంటూ మస్క్‌ ట్వీట్‌ చేశారనేది ప్రధాన ఆరోపణ. ఈ ట్వీట్‌ కారణంగా షేర్లు  దూసుకుపోవడంతొ వాటాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత   టెస్లా స్టాక్ ట్రేడింగ్ నిలిపివేశారు. దీంతో దాదాపు రెండు వారాల పాటు షేరు ధరలో  తీవ్ర అనిశ్చితి నెలకొంది. దీంతో టెస్లా బోర్డు చైర్మన్‌ పదవినుంచి మస్క్‌ను తొలగించాలని 20మిలియన్ల డాలర్ల జరిమానా విధించాలని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆదేశించింది. మస్క్ చేసిన ఈ ట్వీట్‌పై జడ్జి ఎడ్వర్డ్ చెన్ ఇప్పటికే మస్క్  ట్వీట్ తప్పు అని నిర్ధారించారు. అయితే  మస్క్‌ నిర్లక్ష్యంగా ప్రవర్తించి, టెస్లా వాటాదారులకు ఆర్థికంగా హాని కలిగించాడా లేదా అనే నిర్ణయాన్ని జ్యూరీకి వదిలివేసింది.

టెస్లాకు భారీ జరిమానా
మరోవైపు టెస్లాపై 2.85 బిలియన్ వోన్ (2.2 మిలియన్‌ డాలర్లు ) జరిమానా విధించేందుకు దక్షిణ కొరియా యాంటీట్రస్ట్ రెగ్యులేటర్‌ సిద్ధమవుతోంది. తక్కువ ఉష్ణోగ్రతలలో దాని ఎలక్ట్రిక్ వాహనాల క్క తక్కువ డ్రైవింగ్ పరిధి గురించి వినియోగదారులకు చెప్పడంలో విఫలమైందని కొరియా ఫెయిర్ ట్రేడ్ కమీషన్ (కేఎఫ్టీసీ) ఆరోపించింది. 

కాగా 2018 తరువాత  టెస్లా షేరు 6 రెట్లకు పైగా ఎగిసింది. కానీ 44 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ కొనుగోలు తరువాత టెస్లా షేరు ధర దారుణంగా పడిపోయింది. దాదాపు  సగానికి సగం పతనమై ప్రస్తుతం 120 డాలర్లకు పరిమితమయ్యాయి. 
 

మరిన్ని వార్తలు