ట్విటర్‌లో ఉద్యోగం పోయింది..ప్లీజ్‌ నాకు సాయం చేయరూ?

25 Nov, 2022 21:43 IST|Sakshi

ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ తీసుకుంటున్న నిర్ణయాలు గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. బాస్‌గా వచ్చీ రాగానే ట్విటర్‌లో వేలాది మంది ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే. అయితే వారిని తిరిగి నియమించుకున్నారు. ఇప్పుడు వాళ్లనే తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో అలా ఉద్యోగం కోల్పోయిన హెచ్‌-1 బీ వీసా దారుడు పీట‌ర్ యాంగ్ ట్విటర్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ట్విటర్‌లో డాక్యుమెంటేష‌న్‌, కోడ్ శాంపిల్స్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్నా. నవంబర్‌ ప్రారంభంలో తొలగించిన ఉద్యోగుల్ని సంస్థ తిరిగి నియమించుకుంది. వారిలో నేనూ ఉన్నాను.

కానీ ఏమైందో ఎటువంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా గ‌త రాత్రి తిరిగి నన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు  ట్విటర్‌ తెలిపిందన్నారు. కాగా, హెచ్‌-1 బీ వీసాపై ఉన్న తాను కొత్త ఉద్యోగం వెతుక్కోవ‌డానికి 60 రోజులే  సమయం ఉంద‌ని, త‌న‌కు సాయం నెటిజన్లను కోరారు. 

>
మరిన్ని వార్తలు